Jabardasth Fame Kiraak RP : జబర్దస్త్ మాజీ కమెడియన్ కిరాక్ ఆర్ పి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఒక్కప్పటి అదే షో జడ్జి, మాజీమంత్రి రోజాపై తరచూ మాట్లాడుతున్నారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుతో వ్యాపార రంగంలో అడుగుపెట్టిన ఆర్పి.. తరువాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.టిడిపి, జనసేనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. అయితే అదే పనిగా ఆర్కే రోజాను టార్గెట్ చేస్తున్నారు. ఎప్పుడూ తనేం మాట్లాడుతున్నాడో అనేది తనకే అర్థం కాని కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు దేవతలా కల్పించిన రోజా ఇప్పుడు ఆయనకు దయమై కనిపిస్తోంది. దెయ్యం ముఖం వేసుకుని అంటూ అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్నారు ఆర్పి. అయితే గతంలో రోజా చేసిన కామెంట్స్ కు ఇప్పుడు తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. జబర్దస్త్ బ్యాచ్ మెగా ఫ్యామిలీ భజన చేయకపోతే అవకాశాలు ఉండవని గతంలో రోజా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రోజాకు అదే జబర్దస్త్ బ్యాచ్ కు చెందిన ఆర్పి చుక్కలు చూపిస్తుండడం విశేషం. ఈ ఎన్నికల ప్రచారంలో రోజాను టార్గెట్ చేసుకున్నారు ఆర్పి. అయితే ఎన్నికల అనంతరం రోజా సైలెంట్ అయ్యారు. కానీ ఇటీవల వైసిపి అధికార ప్రతినిధిగా ప్రకటించిన తరువాత రాజకీయ విమర్శలు చేస్తున్నారు. దీంతో మరోసారి పని చెప్పారు కిరాక్ ఆర్పి. ఇటీవల తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో రోజా తరచూ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కిరాక్ ఆర్పి స్పందించారు. తిరుమల లడ్డులో రోజా కొవ్వు కలిపారు, ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వుని లడ్డులో వాడారు. రోజా కొవ్వుని తిరుమల లడ్డులో వాడారు అంటూ ఆర్పి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే కిరాక్ ఆర్పీ చేస్తున్న విమర్శలపై నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రోజాను ఎవరూ సమర్ధించకపోయినా.. ఆర్పి వాడుతున్న భాష పై మాత్రం అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
* వయస్సు గురించి ఎద్దేవా
అంతటితో ఆగని ఆర్పి ఆమె వయసు గురించి ఎద్దేవా చేశారు.’ రోజా తిరుపతి అమ్మాయని చెప్పుకొస్తోంది. అసలు ఆవిడ వయస్సు ఎంత? ఆవిడ అమ్మాయి ఏంటి. మా అమ్మ కన్నా రెండేళ్లు పెద్ద.. అమ్మాయిని చెప్పుకొస్తోంది. అసలు ఆమెలో ఆడతనం అనేది ఉందా? అసలు ఆడ మనిషిలా ఆమె ప్రవర్తించిందా? అని మొదలుపెట్టి తిరుమల లడ్డులో కలిపింది ఆమె కొవ్వేనంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆర్పి.
* మహిళ అని చూడకుండా
అయితే మాజీ మంత్రి రోజా విషయంలో ఎవరికీ సానుకూలత లేదు. ఆమె వాడే భాషపై కూడా అభ్యంతరాలు ఉన్నాయి. కానీ ఆమె ఒక మహిళ. ఆపై మాజీ మంత్రి. మరి ఇంతగా ఆర్పి ఒక మహిళను పట్టుకొని అలా మాట్లాడడం ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకప్పుడు జబర్దస్త్ లో అమ్మ.. రోజమ్మ అంటూ ఆకాశానికి ఎత్తిన ఆర్పి కి ఈ విషయాలు తెలియవా? కేవలం రాజకీయాల కోసమే ఆమెను పంది అని తిట్టడం కరెక్ట్ కాదని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే బుల్లితెర నటులు చాలామంది రోజాను విమర్శించారు. ఆమె మాత్రం వారిని పట్టించుకోలేదు. వారి పేర్లు సంబోధించకుండానే.. పిల్లి పిత్రి గాళ్లు అంటూ వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికైతే కిరాక్ ఆర్పి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.