Pawan Kalyan Martial arts: గతంలో రాజకీయం చాలా హుందాగా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. రాజకీయం అంటే ఒక వైరంగా చూస్తున్నారు. రాజకీయం అంటే శత్రువులకు మించి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇటీవల జపనీస్ కత్తిసాములో అధికారికంగా ప్రవేశం లభించింది. ఆయనకు ఉన్న ప్రత్యేక ఆసక్తితో ఈ గుర్తింపు దక్కింది. దీనిపై పవన్ కళ్యాణ్ కు అభినందించాలి. అదో అరుదైన కళ కావడంతో అభినందించాల్సిన అవసరం ఉంది. పోనీ అభినందించ లేకపోతే మౌనంగా ఉండాలి. కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పై వాడుతున్న భాష.. సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ జుగుప్సాకరంగా ఉన్నాయి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులతో పాటు అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం మాత్రం అతిగా ఉంది.
వ్యతిరేకులు అధికం..
పవన్ కళ్యాణ్ విషయంలో అభిమానులు ఎంతలా ఉంటారో.. వ్యతిరేకులు కూడా అంతే మంది ఉంటారు. ఎందుకంటే తమను అధికారం నుంచి దూరం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ శ్రేణులు నిత్యం విమర్శలు చేస్తూనే ఉంటాయి పవన్ పై. ఇప్పుడు అరుదైన కళలో ప్రవేశం లభించడాన్ని కూడా తట్టుకోలేకపోతున్నాయి. తిరుపతి మెట్లు ఎక్కలేకపోయినా పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ లో ఈ గుర్తింపు ఎలా వచ్చిందని విపరీత అర్ధాలు తీస్తున్నారు అంటే వారికి జపనీస్ కత్తిసాము పై అవగాహన లేదు అని అర్థమవుతోంది. ఏదో విమర్శించాలి కదా అని అలా వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
చాలా రోజులుగా..
వాస్తవానికి పవన్ కళ్యాణ్ కు వచ్చిన గుర్తింపు ఇప్పటిది కాదు. సినీ రంగ ప్రవేశ సమయంలోనే ఆయనకు మార్షల్ ఆర్ట్స్ పై మంచి పట్టు ఉంది. చాలా సినిమాల్లో సాహస కృత్యాలు కూడా చేశారు. ఎటువంటి డూప్ లేకుండా నటించారు. జపాన్ వెలుపల ఒక తెలుగు వ్యక్తిగా పవన్ కళ్యాణ్ జపనీస్ కత్తిసాములో అధికారికంగా ప్రవేశించడం అనేది ప్రత్యేకమే. అంతకుమించి అరుదైన విషయమే. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఎంత మాత్రం రుచించడం లేదు. వారి మానసిక వికృతానికి సాక్ష్యం కూడా. గతంలో తిరుపతి మెట్లు ఎక్కే సమయంలో పవన్ కళ్యాణ్ వెన్ను నొప్పితో బాధపడేవారు. దానిని ఉదాహరిస్తూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై లేనిపోని వ్యాఖ్యలు చేస్తుండడం మాత్రం నిజంగా దురదృష్టకరం.
అయితే ఒక్క విమర్శలతోనే ఆగలేదు. పాతబస్తీలోని ఓ సంస్థ సర్టిఫికెట్ ఇచ్చిందంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అధునాతన శిక్షణను భారతదేశంలో జపాన్ యుద్ధకళల అగ్రగన్యుల్లో ఒకరైన హన్సి ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహమ్మదీ వద్ద పొందారు ఆయన కేవలం హైదరాబాద్ కి పరిమితమైన వ్యక్తి కాదు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై ఉన్న రాజకీయ వ్యతిరేకతతో.. ప్రాంతీయతను అడ్డుపెట్టుకొని విమర్శిస్తున్నారు. ఇది నిజంగా అవగాహన రాహిత్యమే.