Bhartha Mahasayulaku Wignyapthi Review: రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. కొన్ని రోజుల నుంచి రవితేజ వరుస ఫెయిల్యూర్స్ ని మూట గట్టుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాతో సక్సెస్ ను సాధిస్తాడని ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తాడు అంటూ మేకర్స్ అయితే మొదటి నుంచి చాలా మంచి ప్రమోషన్స్ చేసుకుంటూ వచ్చారు… ఇక ఈ సినిమా ఎలా ఉంది? రవితేజ ఖాతాలో సక్సెస్ పడిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…
కథ
రవితేజ – డింపుల్ హయతి ని పెళ్లి చేసుకొని చాలా సెటిల్డ్ లైఫ్ ను గడుపుతుంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రవితేజ ఒక ట్రిప్ కి వెళ్తాడు. అక్కడ తనకి ఆషిక రంగనాథన్ తో పరిచయం ఏర్పడుతుంది. తనకి కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఆషిక రంగనాథన్ లో ఉండటం వల్ల రవితేజ తనకి తెలియకుండానే ఆషిక ను లవ్ చేస్తుంటాడు. ఇక తను కూడా రవి తేజ ను ప్రేమిస్తుంది…అటు భార్య, ఇటు లవర్ మధ్యలో రవితేజ ఎలా నలిగిపోయాడు. ఫైనల్ గా ఆయన ఎవరికి సొంతమయ్యాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
డైరెక్టర్ కిషోర్ తిరుమల ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీయడంలో సిద్ధహస్తుడు. నేను శైలజా సినిమాను చాలా సెన్సిబుల్గా హ్యాండిల్ చేశాడు. ఇక ఈ సినిమా సైతం ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడుకున్న సినిమా కావడంతో ఈ సినిమాని కూడా అదే రేంజ్ లో తీసుకెళ్తారని ప్రతి ఒక్క అభిమాని అనుకున్నాడు. కానీ వాళ్ళందరి అంచనాలను తారుమారు చేస్తూ కిషోర్ తిరుమల ఈ సినిమాలో కామెడీని బాగా పండించినప్పటికి ఎమోషనల్ సన్నివేశాలను అంతగా బ్యాలెన్స్ చేయలేకపోయాడు. రవితేజ వెన్నెల కిషోర్ సునీల్ చేత కామెడీ చేయించిన విధానం బాగుంది.
రవితేజ క్యారెక్టరైజేషన్ ని రాసుకున్న విధానం బాగుంది. కానీ క్లైమాక్స్ లో సరైన క్లారిటి ఇవ్వలేకపోయాడు. ఫస్టాఫ్ మొత్తం ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్లిన ఆయన సెకండాఫ్ వచ్చేసరికి చాలా విషయాల్లో తడపడ్డాడు. క్లైమాక్స్ లో క్లారిటీ మిస్ అయిందనే చెప్పాలి. అప్పటిదాకా ఒక ఎజెండాతో ఉన్న కొంతమంది అప్పటికప్పుడు ఏ కారణం లేకుండా మారిపోతూ ఉంటారు. దానికి కారణం ఏంటి అనేది పర్ఫెక్ట్ రీజన్ చూపించలేకపోయాడు… అలాగే క్లైమాక్స్ కూడా అంత కన్విన్సింగ్ గా లేదు. అది సినిమాకి పెద్ద మైనస్ గా మారింది.
రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలు మాస్ ఎంటర్టైనర్లుగా వచ్చేవి. అందులో ఎంతో కొంత యాక్షన్ ఎపిసోడ్స్ ఉండేవి అవి ప్రేక్షకులను అలరించేవి…కానీ ఈ సినిమాలో కామెడీ తప్ప మిగతా ఏది కూడా అంత ఎఫెక్టివ్ గా లేదు… భీమ్స్ అందించిన మ్యూజిక్ పర్లేదు అనిపించింది. కానీ సాంగ్స్ మాత్రం రాంగ్ ప్లేస్మెంట్లో పెట్టారని అనిపిస్తుంది. సాంగ్స్ ఉన్నాయి కదా వాడేద్దాం అన్నట్టుగా ప్రవర్తించారు కానీ ఒక సాంగ్ కి కూడా పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ ఇవ్వలేకపోయారు… కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో భీమ్స్ కి ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
రవితేజ అటు భర్త గా, ఇటు లవర్ గా చాలా మెచ్యుర్డ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. కొన్ని కామెడీ సన్నివేశాల్లో వింటేజ్ రవితేజ కనిపించాడు…ఇక డింపుల్ హయాతికి స్క్రీన్ టైమ్ తక్కువగా ఉంది. అయినప్పటికి ఆమె తన పాత్రకి న్యాయం చేసింది. ఇక ఆషిక రంగనాథన్ మాత్రం ఫుల్ లెంత్ క్యారెక్టర్ లో చక్కటి నటనను కనబరిచింది…
సునీల్ చాలా రోజుల తర్వాత కామెడీ క్యారెక్టర్ చేసి నవ్వించాడు. వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకి ప్రధానాకర్షణ గా నిలుస్తుంది. ఇక సత్య ఎపిసోడ్ సైతం బాగుంది.ఆయన తన కామెడీతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు…ఇక మిగతా ఆర్టిస్టులందరు వల్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
భీమ్స్ మ్యూజిక్ బాగుంది. కొన్ని సాంగ్స్ కి థియేటర్స్ లో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. రవితేజ ఎంట్రీ ఇచ్చినప్పుడు వచ్చే బిజియం బాగుంది. సినిమాటోగ్రఫీ పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. కలర్ గ్రేడింగ్ విషయం లో కొంత వరకు ఇబ్బంది కలిగింది. అలాగే సీన్ మూడ్ ను బట్టి సెపరేట్ లైటింగ్ ను సెట్ చేయకుండా సీరియల్ టైప్ ఆఫ్ లైటింగ్ పెట్టడం వల్ల కొన్ని సందర్భాల్లో సీరియల్ చూస్తున్న ఫీల్ కలుగుతుంది.
మూవీలో బాగున్నవి
రవితేజ యాక్టింగ్
మ్యూజిక్
బాగోలేనివి
స్క్రీన్ ప్లే
అక్కడక్కడ డైరెక్షన్ కూడా బాగాలేదు…
క్లైమాక్స్
రేటింగ్ : 2.25/5
చివరి లైన్ : టైమ్ పాస్ కోసం ఒకసారి చూసి నవ్వుకోవచ్చు…