Ishan Kishan: టి20 వరల్డ్ కప్ లో టీమిండియా పంజా విప్పింది. సింహం మాదిరిగా రెచ్చిపోయింది. నమిబియా జట్టుతో గురువారం జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ దుమ్ము రేపాడు.
కిషన్ 24 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ శర్మ కడుపునొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో అతడి స్థానంలో సంజు శాంసన్ వచ్చాడు. కిషన్, సంజు కలిసి తొలి వికెట్ కు కేవలం 2 ఓవర్లలోనే 25 పరుగులు సాధించారు. ఈ క్రమంలో సంజు 8 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్ల సహాయంతో 22 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడుతున్న క్రమంలో బెన్ శిఖంగో బౌలింగ్లో లారెన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. టి20 వరల్డ్ కప్ లో బంతుల పరంగా చూసుకుంటే యువరాజ్ సింగ్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. 2007లో డర్బన్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 12 బంతుల్లో అతడు హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో అతడు బ్రాడ్ బౌలింగ్లో ఆరు బంతుల్లో.. ఆరు సిక్సర్లు కొట్టాడు.
యువరాజ్ తర్వాత సెకండ్ ప్లేస్ లో కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. 2021లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ పై అతడు 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
కె.ఎల్ రాహుల్ తర్వాత రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. 2024లో గ్రాస్ హైలెట్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై అతడు 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
రోహిత్ తర్వాత యువరాజ్ సింగ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 2007లో డర్బన్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో యువరాజ్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
ఇక తాజా మ్యాచ్లో ఇషాన్ కిషన్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో అతడు ఐదవ స్థానాన్ని ఆక్రమించాడు.
టి20 వరల్డ్ కప్ చరిత్రలో టీమిండియా తరఫున కేవలం పవర్ ప్లే ఓవర్లలోనే హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో చేరుకున్నాడు కిషన్.
2024 లో గ్రాస్ హైలెట్ వేదికగా ఆస్ట్రేలియా పై రోహిత్ శర్మ 21 బంతుల్లో 51* పరుగులు చేశాడు.
2021లో దుబాయ్ వేదికగా స్కాట్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ 19 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
2026 లో ఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రస్తుత మ్యాచ్ లో ఇషాన్ కిషన్ 20 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
ఇక ప్రస్తుతం మ్యాచ్లో టీమిండియా పవర్ ప్లే లో ఏకంగా 66/1 పరుగులు చేసింది. టీ జాబితాలో వెస్టిండీస్ నెంబర్ వన్ స్థానంలో ఉంది.
2024లో గ్రాస్ హైలెట్ వేదికగా ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ పవర్ ప్లే లో 92/1 పరుగులు చేసింది.
2014లో సైల్ హెట్ వేదికగా ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్ 91/1 పరుగులు చేసింది.
2016లో ముంబై వేదికగా సౌత్ ఆఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 89/3 పరుగులు చేసింది.
ఇక తాజా మ్యాచ్లో నమీబియా మీద టీమిండియా 86/1 పరుగులు చేసింది.
ISHAN KISHAN – FIRST INDIAN WICKETKEEPER IN T20 WORLD CUP HISTORY TO SCORE A FIFTY. pic.twitter.com/bWvmV7b2ID
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 12, 2026