Homeఆంధ్రప్రదేశ్‌YCP: వైసిపి కాన్ఫిడెన్స్ వెనుక వ్యూహం అదా?

YCP: వైసిపి కాన్ఫిడెన్స్ వెనుక వ్యూహం అదా?

YCP: వైసీపీ నేతలు విశ్వాసానికి కారణమేంటి? మరోసారి అధికారంలోకి వస్తామన్న ధీమా వెనుక వ్యూహం ఏంటి? వచ్చే స్థానాలు, సీఎంగా ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు వెనుక రీజన్ ఏంటి? పొలిటికల్ సర్కిల్లో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. గట్టి ఫైటే నెలకొంది. కానీ పోలింగ్ శాతం పెరగడం, ప్రభుత్వ వ్యతిరేకత కనిపించడంతో.. ఈసారి కూటమిదే గెలుపు అన్న సంకేతాలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా సర్వేలు కూడా కూటమికే జై కొట్టాయి. కానీ ఈ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఆయనకు అత్యంత విధేయులైన నేతలు.. వైసీపీకి వచ్చే స్థానాలతో పాటు సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన తేదీని సైతం ప్రకటించారు. దీంతో ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ నెలకొంది. వైసీపీకి కూడా ఛాన్స్ ఉందా? అన్న ప్రచారం ప్రారంభమైంది.

దేశంలోని ప్రముఖ సెఫాలజిస్టులు ఏపీలో కూటమిదే గెలుపు అని తేల్చేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ సైతం.. ఏపీలో జగన్ కు ఘోర ఓటమి తప్పదని స్పష్టం చేశారు. టీవీ ఇంటర్వ్యూల్లో టిడిపి కూటమిదే గెలుపు అని తేల్చేశారు. ప్రధాని మోదీ ఓ తెలుగు టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం.. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు. అయితే ఎంతమంది చెప్పినా వైసీపీ నుంచి మాత్రం ఆశలు చావలేదు. పైగా తమకు లభించే సీట్లతో పాటు ఏకంగా ప్రమాణస్వీకారం తేదీని ప్రకటించడం అందర్నీ డిఫెన్స్ లో పెడుతోంది. వైసిపి కాన్ఫిడెన్స్ వెనుక ఉన్న కారణం, వ్యూహం ఏంటన్న చర్చ నడుస్తోంది.

అయితే వైసీపీ ది ప్రత్యేక వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి ఒక పిక్చర్ ఉందని.. కానీ ఫలితాలు ప్రకటించే వరకు బయట పెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలా ఓటమిని బయట పెట్టుకుంటే అధికార యంత్రాంగం చెప్పు చేతల నుంచి పోతుందని.. కౌంటింగ్ నాడు ఏజెంట్లు కూడా భయపడతారని.. అందుకే ఎట్టి పరిస్థితుల్లో గెలుపు అనే మాట విడిచి పెట్టకూడదని వైసీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే వైసిపి నుంచి వస్తున్న గెలుపు అనే మాట.. కేవలం జగన్, ఆయన అస్మదీయ నేతల నుంచి మాత్రమే వస్తోందన్న విషయాన్ని గ్రహించాలి. దీనిపై పార్టీ సీనియర్లు, సీనియర్ మంత్రులు మాట్లాడడం లేదు. మంత్రి బొత్స సత్యనారాయణ, జోగి రమేష్ వంటి వారితోనే మాట్లాడిస్తున్నారు. అటు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. గెలుపు అనే మాటను బయటకు వదిలి.. పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆత్మస్థైర్యం ఉండేలా చూసుకున్నారు. జూన్ 4న ఫలితాలు ఎలాగూ వస్తాయి. దానికి అనుగుణంగా ప్రకటనలు చేసుకుందాం.. అంతదాకైనా అటు యంత్రాంగాన్ని, ఇటు పార్టీ శ్రేణులను చెప్పు చేతల్లో ఉంచుకోవాలన్న ప్రయత్నమే ఇదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version