Salaar 2: సలార్ 2 నా లేదంటే ఎన్టీయార్ సినిమానా ఏది ముందు స్టార్ట్ అవ్వబోతుందంటే..?

ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయాల్సి ఉంది. మరి ఎన్టీఆర్ సినిమాను ముందు తీసుకొస్తాడా లేదా అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు.

Written By: Gopi, Updated On : May 24, 2024 10:05 am

Salaar 2 or NTR movie which is going to start first

Follow us on

Salaar 2: కన్నడ సినిమా ఇండస్ట్రిలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజిఎఫ్ తో తనకంటూ పాన్ ఇండియాలో సూపర్ మార్కెట్ ను అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఇచ్చిన సక్సెస్ తో ప్రభాస్ తో సలార్ సినిమా చేశాడు. అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఇక దాంతో ప్రశాంత్ నీల్ పేరు ఒక్కసారిగా పాన్ ఇండియాలో మారు మ్రోగి పోయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ ఇటు అభిమానులు అటు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇలాంటి సమయంలో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయాల్సి ఉంది. మరి ఎన్టీఆర్ సినిమాను ముందు తీసుకొస్తాడా లేదా అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఈ విషయం మీద రీసెంట్ గా స్పందించిన దర్శకుడు మాత్రం ఎన్టీఆర్ సినిమాని ముందుగా సెట్స్ మీద తీసుకురావాలని చూస్తున్నాడు… ఎందుకంటే ప్రభాస్ ఇప్పటికే వరకు వరుసగా మూడు సినిమాలు కమిటై ఉన్నాడు.

కాబట్టి ఆ మూడు సినిమాలు పూర్తి అయిన తర్వాతనే సలార్ 2 సినిమాలో పాల్గొనే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మరో సంవత్సరం అయితే పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలోపు తను ఎన్టీఆర్ తో సినిమా చేసి మళ్లీ ప్రభాస్ సినిమా మీదికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే ప్రశాంత్ నీల్ అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ తో భారీ సక్సెస్ ని కొడతాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

అయితే ఈ సినిమా కూడా డార్క్ ఫేజ్ లోనే తీయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ అంటే మనందరికీ కే జి ఎఫ్ సినిమా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన ఇచ్చిన ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. ఒక క్యారెక్టర్ కి ఎలాంటి ఎలివేషన్స్ అయితే కావాలో అలాంటి ఒక సూపర్ ఎలివేషన్స్ తో ఈ సినిమా అనేది ముందుకు సాగుతుంది…