Chaganti Koteswara Rao: ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. రెండో జాబితాను ప్రకటించారు.అందులో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు ఛాన్స్ ఇచ్చారు. కీలకమైన సలహాదారు పదవి ప్రకటించారు.దానికి క్యాబినెట్ హోదా కూడా ఇచ్చారు. అయితే చాగంటి తీసుకుంటారా? లేదా? అన్న అనుమానం కలిగింది. గతంలో రెండుసార్లు ప్రభుత్వాలు ఆయనకు నామినేటెడ్ పదవులు ఇచ్చాయి. కానీ రెండుసార్లు కూడా చాగంటి తిరస్కరించారు. 2014సమయంలో కూడా టిడిపి ప్రభుత్వం ఒక నామినేటెడ్ పదవి ఇచ్చింది.అయితే ప్రభుత్వం అప్పగించే సేవలను పూర్తి చేస్తాను కానీ.. పదవులు మాత్రం తీసుకోనంటూ అప్పట్లో చాగంటి నిరాకరించారు.అటు తర్వాత వైసిపి ప్రభుత్వం సైతం ఒక పదవిని ఆఫర్ చేసింది.అప్పుడు కూడా చాగంటి కోటేశ్వరరావు తిరస్కరించారు.అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సలహాదారు పదవి తీసుకునేందుకు చాగంటి సమ్మతించారు. దీంతో క్యాబినెట్ హోదా ఇస్తే తప్ప చాగంటి పదవిని స్వీకరించరా? అని వైసిపి అనుకూల మీడియా ప్రశ్నించడం ప్రారంభించింది.
* ధర్మ ప్రచార పరిషత్ సలహాదారుడిగా
వైసిపి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోనే ధర్మ ప్రచార పరిషత్తు కు సలహాదారుడుగా ఉండాలని చాగంటిని వైసీపీ సర్కార్ కోరింది. ఏకంగా సలహాదారు పదవిని ప్రకటించింది కూడా.అయితే అప్పట్లో నడిచిన రాజకీయాలు,టీటీడీ వేదికగా పరిణామాలు నచ్చక సున్నితంగా తిరస్కరించారు చాగంటి.ఈ విషయంలో కరాకండిగా తేల్చి చెప్పారట. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సలహాదారు పదవి ఇచ్చింది. క్యాబినెట్ హోదా కల్పించింది. పదవి తీసుకునేందుకు చాగంటి సమ్మతించారు.అందుకే ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా రెచ్చిపోతుంది. చాగంటి కి వ్యతిరేకంగా కథనాలు రాస్తోంది.
* వైసీపీకి షాక్
అయితే ఇప్పుడు చాగంటి పదవి తీసుకునేందుకు సమ్మతించడంతో వైసీపీకి షాక్ తగిలినట్లు అయింది. కేవలం క్యాబినెట్ హోదాకల్పించడంతోనే చాగంటి పదవి తీసుకునేందుకు ఒప్పుకున్నారని ప్రచారం చేస్తోంది.అదే సమయంలో కూటమి పార్టీలు దానికి బదులిస్తున్నాయి.జగన్ పదవి ఇస్తే తీసుకోని చాగంటి..చంద్రబాబు ఇస్తే మాత్రం తీసుకున్నారని.. ఈ తేడాను జనం గమనించాలంటూ సోషల్ మీడియాలో టిడిపి, జనసేన మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు. అప్పట్లో జగన్ కు ఉన్న ఇమేజ్, ఆయన ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను చూసి చాగంటి పదవి తీసుకునేందుకు భయపడ్డారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉన్న మంచి పేరు దృష్ట్యా ఆయన పదవి చేపట్టేందుకు ముందుకు వచ్చారని కూటమి మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు.