Jagan Appointments: వైసీపీలో( YSR Congress) గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇంకా పాత చింతకాయ వాసనలోనే ఆ పార్టీ ఉంది. సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యలతో ఇది స్పష్టంగా అర్థం అవుతుంది. జగన్ చుట్టూ భజన పరులు చేరారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఆయన బాధ్యతతో చేశారా? లేకుంటే పార్టీ నుంచి బయటకు వెళ్లాలని చేశారా? అసంతృప్తితో మాట్లాడారా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. రాజశేఖర్ రెడ్డి, ఆపై జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత కుటుంబాల్లో మేకపాటి కుటుంబం ఒకటి. ఇప్పటికే ఆ కుటుంబంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. అయితే మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడుగా కొనసాగుతూ వచ్చారు. అటువంటి వ్యక్తి మనసు విప్పి.. భజన పరులను నమ్ముకుంటే ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎంత దాకా వచ్చిందో అర్థం అవుతోంది. ఒక్క సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి కాదు.. చాలామంది సోషల్ మీడియా యాక్టివిస్టులు సైతం దీనిని ప్రస్తావిస్తున్నారు.
* అధినేతను కలవనీయకుండా..
అయితే తాజాగా ఒక సరికొత్త వార్త సోషల్ మీడియాలో( social media) హల్చల్ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డిని కలవకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని.. ఆయన అపాయింట్మెంట్ లభించడం అసాధ్యమని.. డబ్బులు ఉన్న వారికే అపాయింట్మెంట్ ఇస్తున్నారని.. పరోక్షంగా అపాయింట్మెంట్లు అమ్ముకుంటున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. సొంత పార్టీ శ్రేణులే ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఒకవైపు సీనియర్లు భజనపరులు అంటూ వ్యాఖ్యానిస్తుండగా.. మరోవైపు అధినేత అపాయింట్మెంట్ లభించని వారు సైతం ఆవేదనతో ఉన్నారు. ఇలా అయితే కష్టమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షం అంటేనే ప్రజలతోనూ, పార్టీ శ్రేణులతోను పనిచేయాలి. అటువంటి పార్టీ శ్రేణులనే పట్టించుకోకపోవడం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది.
* ప్రతిపక్షంలో ఉన్న..
అధికారంలో ఉంటే.. ముఖ్యమంత్రిగా పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిని కలవడం కుదరదు. ఒకవైపు పార్టీ, మరోవైపు ప్రభుత్వం నడపాలి అంటే సమయం చాలదు. అందుకే అపాయింట్మెంట్లు( appointments ) లభించవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం. ప్రతిపక్షంలో ఉన్నారు. ఇటువంటి సమయంలో పార్టీకి పూర్తిస్థాయిలో సమయం కేటాయించాలి. పార్టీ నేతలకు పూర్తిగా అపాయింట్మెంట్లు ఇవ్వాలి. కానీ పేరు మోసిన నేతలకు, ఆర్థికంగా బలోపేతంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్లు లభిస్తున్నాయి. జగన్ 2.0 చూస్తారని.. కార్యకర్తలతో పాటు నేతలకు పూర్తి సమయం కేటాయిస్తానని జగన్మోహన్ రెడ్డి ఇదివరకే ప్రకటన చేశారు. కానీ క్షేత్రస్థాయిలోకొచ్చేసరికి ఆ పరిస్థితి లేదని కానీ క్షేత్రస్థాయిలోకొచ్చేసరికి ఆ పరిస్థితి లేదని పార్టీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి.