Bandla Ganesh: నటుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలతో సినిమాలను చేసి గొప్ప గుర్తింపు సంపాదించుకున్న నిర్మాత బండ్ల గణేష్… కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన కే ర్యాంప్ అనే సినిమా సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ పాల్గొన్నారు… ఈ ఈవెంట్లో బండ్ల గణేష్ కిరణ్ అబ్బవరం ను ఉద్దేశించి చాలా గొప్ప మాటలు మాట్లాడాడు. ఇప్పటివరకు చాలామంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారని ఒక సక్సెస్ కాదు, రెండు మూడు సక్సెస్ లు వచ్చిన కూడా తన బిహేవియర్ లో ఎలాంటి చేంజ్ ఉండదని తను డౌన్ టు ఎర్త్ ఉంటాడని చెప్పాడు… అలాగే కెరియర్ స్టార్టింగ్ లో చిరంజీవి గారు కూడా ఇలానే ఉండేవారు…ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకో ఆయనంత ఎత్తుకు ఎదుగుతావు అంటూ కిరణ్ అబ్బవరానికి సలహా ఇచ్చాడు. చిరంజీవి గారు అప్పుడు ఎలా ఉన్నారో 150 సినిమాలను పూర్తిచేశాక ఇప్పటికి ఆయన అలానే ఉన్నారు. తొందర్లోనే భారత రత్న అవార్డు ను కూడా అందుకోబోతున్నాడు…
చిరంజీవి గారు ఇప్పటికీ ఆయన దర్శకుల పట్ల, నిర్మాతల పట్ల చాలా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటాడు. అందరిని సమానంగా చూస్తూ ఉంటాడు. అందువల్లే ఆయన మెగాస్టార్ గా ఎదిగాడు అంటూ ఈ ఈవెంట్లో చిరంజీవి ని కూడా ఆకాశానికి ఎత్తేశాడు. ఈ సమయంలోనే ఒక హీరోను ఉద్దేశించి బండ్ల గణేశ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఆయన ఏం మాట్లాడాడు అంటే కొందరు హీరోలు ఒక సక్సెస్ రాగానే లూజ్ పాయింట్స్ వేసుకొని, స్టైల్ కండ్లద్దలు పెట్టుకొని ఇలా ఇలా నడిచే హీరోలు కాదు…హీరో అంటే కిరణ్ లా ఉండాలి అంటూ కామెంట్స్ చేశాడు… అలాగే ఆ హీరోలు జనాల్లోకి వెళితే వాట్సప్ అంటూ హంగామా చేస్తారు. తన నెక్స్ట్ సినిమా కోసం లోకేష్ కనకరాజును తీసుకురా, రాజమౌళి ని తీసుకురా, సుకుమార్ ను తీసుకురా అంటూ గొంతమ్మ కోర్కెలు కోరుతూ ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెడుతుంటారని ఆయన కొన్ని ఘాట్ కామెంట్స్ చేశాడు…
ఇక ప్రస్తుతం బండ్ల గణేష్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది… ఇదంతా చూసిన జనాలు మాత్రం బండ్ల గణేష్ విజయ్ దేవరకొండ ను ఉద్దేశించే ఇలాంటి ఘాటు కామెంట్స్ చేశారంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం బండ్ల గణేష్ మీద కొంత వరకు సీరియస్ అవుతున్నారు…
