Homeఆంధ్రప్రదేశ్‌AP government Advisory For Indians In Iran: ఇరాన్ లో ఉన్న ప్రవాసాంధ్రులకు హై...

AP government Advisory For Indians In Iran: ఇరాన్ లో ఉన్న ప్రవాసాంధ్రులకు హై అలెర్ట్!

AP government Advisory For Indians In Iran: ఇరాన్ పై( Iran) ఏ క్షణమైనా అమెరికా దాడి చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇరాన్ లో పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉన్న ఏపీ వాసులు తక్షణం వచ్చేయాలని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఇరాన్ లో ఉన్న వారంతా వెంటనే వచ్చేయాలని.. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్వదేశానికి వచ్చేసేందుకు డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలని కూడా సూచించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. ఇరాన్ లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. ఇందుకుగాను హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు.

* దాడికి సిద్ధంగా అమెరికా..
ఇరాన్లో ఏపీకి చెందిన విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారులు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇరాన్ లో పరిస్థితి ఏమంత బాగాలేదు. ఏ క్షణంలోనైనా అమెరికా దాడి చేయవచ్చు అని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇరాన్ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ లో ఉండడం అంత శ్రేయస్కరం కాదని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది. అక్కడ ఉన్న భారతీయులంతా ఇరాన్ లోని భారత రాయబారక్ కార్యాలయంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది కేంద్రం. భారతీయులు ఇరాన్ వీడి ఇండియాకు రావాలని.. విమానాలతో సహా అందుబాటులో ఉన్న ఏదైనా రవాణా సౌకర్యాలను ఉపయోగించుకోవాలని సూచించింది. ఇరాన్లోని ఇండియన్ అంబాసి దగ్గర తమ వివరాలు నమోదు చేయించుకోని వారు.. వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని కూడా సూచిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం కొన్ని ఫోన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చారు.+989128109115,+ 989128109109, + 989128109102, + 989932179359 నంబర్లకు సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

* ఏపీ మంత్రి విజ్ఞప్తి..
ఏపీ( Andhra Pradesh) నుంచి ఇరాన్ వెళ్లిన చాలామందికి ఏపీ ప్రభుత్వం నుంచి సూచనలు వెళ్లాయి. సురక్షితంగా అక్కడ ఉన్నవారు రావాలని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఇరాన్ లో ప్రవాసాంధులు పాస్పోర్ట్ లు, ఐడి కార్డులు, మిగిలిన ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అత్యవసర సహాయం కోసం + 918500027678 నంబర్కు సంప్రదించాలని సూచించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version