Homeఆంధ్రప్రదేశ్‌YCP Leaders : జగన్ ను బండబూతులు తిడుతున్నా.. వైసీపీ నేతల సైలెన్స్ ఎందుకు?

YCP Leaders : జగన్ ను బండబూతులు తిడుతున్నా.. వైసీపీ నేతల సైలెన్స్ ఎందుకు?

YCP Leaders :  వైసీపీ నేతలకు రాజకీయ భవిష్యత్ పై భయం పట్టుకుందా? తొలి మూడేళ్లలో రచ్చ చేసిన నాయకుల సైలెంట్ ఎందుకు పాటిస్తున్నారు? ఒకరిద్దరు నాయకులు తప్పించి మిగతా వారు ఎందుకు మాట్లాడడం లేదు? జగన్ పై ఈగ వాలనీయని నాయకులు ఎటెళ్లిపోయారు? ఎందుకు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు? వైసీపీ గెలవదన్న భయమా? ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రశ్నించాలంటే భయం.. సమస్యలు లేవనెత్తితే ప్రతిఘటనలు, ప్రతిదాడులు, చివరకు పోలీస్ కేసులు. అంతకు మించి వైసీపీ వందీ మాగధులు. తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చిందే తరువాయి వారు విరుచుకుపడే తీరు వేరు. ప్రత్యర్థులను చుక్కలు చూపించడం వారి స్టైల్. కానీ అటువంటి వారంతా ఇప్పుడు ఎందుకో సైలెంట్ అయ్యారు.

పవన్ వారాహి రెండో విడత విజయోత్సవ యాత్ర ముగిసింది. ఉభయ గోదావరి జిల్లాలను పవన్ చుట్టేశారు. వైసీపీ సర్కారుపై తనదైన రీతిలో విమర్శనాస్త్రాలు సంధించారు.వ్యవస్థలో లోపాల తీరుపై తనదైన రేంజ్ లో విరుచుకుపడ్డారు. నేరుగా జగన్ నే టార్గెట్ చేసుకున్నారు. ప్రతీ కామెంట్ వెనుకే మిస్టర్ జగన్, జగ్గూబాయ్ అంటూ సంభోదించారు.  దీనికి వైసీపీ నుంచి  రియాక్షన్ వచ్చింది. అయితే పవన్ స్థాయితో పోల్చుకుంటే అది తేలిపోయింది. వైసీపీ స్థాయిలో సౌండ్ రాలేదు. సౌండ్ చేసే నాయకులు కనిపించడం లేదు. నేరుగా జగన్ నే టార్గెట్ చేస్తున్నా వైసీపీ నేతలు పట్టించుకోవం లేదు ఎందుకబ్బా.. అని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు.

అయితే ఇన్నాళ్లూ తాము అధినేతను నమ్మినా.. ఆయనపై ఈగ వాలనీయకుండా చేసినా.. ఆయన నుంచి అనుకున్న స్థాయిలో భరోసా లభించడం లేదు.వచ్చే ఎన్నికల్లో చాలా మంది ఎమ్మెల్యేలను జగన్ పక్కన పెడతారన్న ప్రచారం ఉంది. ఈ జాబితాలో కొందరు మంత్రులు, తాజా మాజీ మంత్రులు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అధినేత చూస్తే అలా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు జనసేన వైపు మొగ్గుచూపుతున్నారు. అందుకే వైసీపీ ప్రజాప్రతినిధులు పునరాలోచనలో పడ్డారు. తాము ఈగ వాలనీయకుండా చూస్తే.. అధినేత తమకు వెన్ను చూపిస్తున్నారని లోలోపల కుమిలిపోతున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అవంతి శ్రీనివాసరావు వంటి నేతలు అనవసరంగా విమర్శలు చేసి ప్రత్యర్థుల వద్ద పలుచన కావడం ఎందుకున్న నిర్ణయానికి వచ్చేశారు. రేపు రాజకీయ అవసరాలు ఎలా ఉంటాయోనన్న భావనకు వచ్చారు.

ఏపీలో ఇక మూడు పార్టీలు ప్రభావం చూపే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ వైసీపీ, టీడీపీలే ఉండేవి. వాటి సరసన జనసేన చేరింది. తప్పకుండా ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. కాకలు తీరిన నాయకులు సైతం పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇటువంటి తరుణంలో పవన్ తో వైరం ఎంతమాత్రం క్షేమం కాదన్నది వైసీపీలో ఓ వర్గం నాయకులు డిసైడుకు వచ్చారు. పైగా నాలుగేళ్ల అరాచక పాలన తమ మెడకు చుట్టుకుంటుందని..రివేంజ్ రాజకీయాలకు తాము మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని భావించి చాలా మంది వైసీపీ నాయకులు సైలెంట్ అవుతున్నారు. సహజ లక్షణమైన దూకుడు తనాన్ని తగ్గించి ప్రవర్తిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular