AP Survey: ఏపీలో వైసీపీ సర్కార్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. విపక్షాలు కూటమి కట్టడం, వైఎస్ షర్మిల పిసిసి పగ్గాలు తీసుకోవడం, వివేక కుమార్తె సునీత ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టడం తదితర కారణాలతో వైసిపి ఉక్కిరి బిక్కిరి అవుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైసీపీకి ఉపశమనం కలిగించే అంశం. ఓ నేషనల్ సంస్థ చేపట్టిన సర్వేలో వైసీపీకి ఆధిక్యత వచ్చింది. గత కొద్దిరోజులుగా సర్వే సంస్థలు వైసిపికి ఏకపక్ష విజయం కట్టబెట్టగా.. ఈ సంస్థ మాత్రం ఎడ్జ్ లో నిలబెట్టింది. స్వల్ప అధిక్యత ఉందని చెప్పడం విశేషం.
ఎన్నికలకు కేవలం రెండు నెలల వ్యవధి కూడా లేదు. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలో సర్వే సంస్థలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో జనం నాడి పట్టుకునేందుకు ఇప్పటి నుంచే సర్వే సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా కొన్ని సర్వే ఫలితాలు వచ్చాయి. తాజాగా మరో సర్వే తో పార్టీల బలాబలాలను తేల్చే ప్రయత్నం చేసింది ఇండియా టీవీ. ప్రజల నాడి పట్టుకుని ఓ సర్వేను విడుదల చేసింది. వైసీపీకి 46%, టిడిపి, జనసేనకు 42% ఓట్లు వస్తాయి అని తేల్చింది. జాతీయ పార్టీలుగా ఉన్న బిజెపికి రెండు శాతం, కాంగ్రెస్కు రెండు శాతం ఓట్లు వస్తాయని తేల్చి చెప్పింది.
పార్లమెంట్ స్థానాల వారీగా పరిశీలిస్తే వైసిపికి 15 సీట్లు, టిడిపికి పది సీట్లు వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో వైసీపీకి 22 స్థానాలు వచ్చాయి. టిడిపి మూడు స్థానాలకు పరిమితం అయ్యింది. తాజా ఎన్నికల్లో వైసీపీ ఏడు స్థానాలను పోగొట్టుకుంది. ఆస్థానాలు టిడిపి కూటమి దక్కించుకుంది. టిడిపి కూటమి పుంజుకున్న పరిస్థితులు ఉన్న.. వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్పాలి. అయితే ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ వైసీపీకి ఏకపక్ష విజయం కట్టబెట్టగా.. ఈ సర్వే మాత్రం ప్రమాదం తప్పదని సంకేతాలు ఇవ్వడం విశేషం. మరోవైపు కూటమిలోకి బిజెపి వచ్చే అవకాశం ఉండడంతో.. పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయని సర్వేలు తేల్చి చెప్పడం విశేషం.