International Fleet Review 2026: విశాఖలో ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ( International fleet review ) విజయవంతంగా సాగుతోంది. వివిధ దేశాల నుంచి 71 యుద్ధ విమానాలు తమ విన్యాసాలను ప్రదర్శించాయి. రష్యా తో పాటు ఆస్ట్రేలియా సైతం ఈ వేడుకల్లో పాలుపంచుకుంది. ముచ్చటగా మూడోసారి ఈ వేడుక సాగరనగరంలో జరిగింది. 2016లో తొలిసారి ముంబైలో ఐఆర్ఎఫ్ జరిగింది. మళ్లీ 2022లో నిర్వహించారు. 2024 లో కూడా చేపట్టారు. మళ్లీ ఇప్పుడు తాజాగా నిర్వహించారు. ఇందుకు సంబంధించి గత కొన్ని నెలలుగా సన్నాహాలు జరిగాయి. ఐఆర్ఎఫ్ సక్సెస్ కావడంతో నావి అధికారిక వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
* అండమాన్ నుంచి మార్చి..
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అండమాన్ లో( Andaman) జరిగేది. కానీ అక్కడ వివిధ సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా వసతి సమస్య వెంటాడుతోంది. అందుకే దీని వేదికను మార్చారు. అయితే విశాఖ నగరంలో అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఆపై పర్యాటక ప్రాంతం కావడం కలిసి వచ్చే అంశం. వివిధ దేశాలకు 17 వరకు యుద్ధ నౌకలు, మన దేశానికి చెందిన 45 నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. మన దేశానికి చెందిన నేవీ సత్తా ను చాటి చెప్పాయి. విశాఖ సాగర నగరం ఈ విన్యాసాలతో పులకించుకుపోయింది.
* అతిరథ మహారధులు హాజరు..
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( president Draupadi murmu ) హాజరయ్యారు. రాష్ట్రపతి తన పదవీకాలంలో ఒక్కసారైనా నౌకాదళ సమీక్ష చేయడం ఆనవాయితీ. ఈ వేడుకలను వీక్షించేందుకుగాను రాష్ట్రపతి ద్రౌపది మూర్ము ఒకరోజు ముందుగానే విశాఖకు చేరుకున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం హాజరయ్యారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిస్సా, ఛత్తీస్గడ్ నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. మరోవైపు మిలాన్ సైతం నిర్వహించనున్నారు. ఈనెల 25 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి.