https://oktelugu.com/

Nikhil Siddharth SPY Movie: ‘స్పై’ చిత్రానికి దారుణమైన అడ్వాన్స్ బుకింగ్స్..హీరో నిఖిల్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యినట్టే!

ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టీ చూస్తే ఈ సినిమాకి మొదటి రోజు రెండు కోట్ల రూపాయిల ఓపెనింగ్ కూడా రావడం కష్టమే అని అంటున్నారు. టాక్ అద్భుతంగా వస్తే తప్ప ఈ సినిమా రీ కవర్ అవ్వదట. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి దాదాపుగా 17 కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి.

Written By:
  • Vicky
  • , Updated On : June 28, 2023 / 01:19 PM IST

    Nikhil Siddharth SPY Movie

    Follow us on

    Nikhil Siddharth SPY Movie: యంగ్ హీరో నిఖిల్ లేటెస్ట్ గా నటించిన చిత్రం ‘స్పై’ రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది. ముస్లిమ్స్ ఘనంగా జరుపుకునే బక్రీద్ పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు బక్రీద్ పండుగ టాలీవుడ్ కి మంచి రెవిన్యూ ఇచ్చే సీజన్. ముఖ్యంగా నైజాం మరియు సీడెడ్ ప్రాంతాలలో అద్భుతమైన వసూళ్లు వస్తుంటాయి. ఇంత మంచి సీజన్ ని కూడా స్పై చిత్రం ఉపయోగించుకోలేకపోతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో చాలా దారుణంగా ఉన్నాయి.

    ‘కార్తికేయ 2 ‘ చిత్రం తర్వాత నిఖిల్ రేంజ్ బాగా పెరిగింది అనుకుంటే, ఇలా ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన సినిమా కి కూడా ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ అన్నీ కూడా ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ జనాల్లో సరైన అంచనాలు ఎందుకో ఈ చిత్రం పై క్రియేట్ అవ్వలేదు.

    ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టీ చూస్తే ఈ సినిమాకి మొదటి రోజు రెండు కోట్ల రూపాయిల ఓపెనింగ్ కూడా రావడం కష్టమే అని అంటున్నారు. టాక్ అద్భుతంగా వస్తే తప్ప ఈ సినిమా రీ కవర్ అవ్వదట. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి దాదాపుగా 17 కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి.

    అయితే టాక్ వస్తే మాత్రం ఈ సినిమా లాంగ్ వీకెండ్ లోనే రికవర్ అయిపోతుందని నమ్మకం తో ఉన్నారు మేకర్స్. కానీ ఇండస్ట్రీ లో నడుస్తున్న ఇన్సైడ్ టాక్ ఏమిటంటే ఈ సినిమా ఔట్పుట్ పై హీరో నిఖిల్ సంతృప్తి గా లేదు అనే. నిర్మాతతో ఈ విషయం పై నిఖిల్ గొడవ కూడా పడ్డాడట. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే మీడియా ముందు ఒప్పుకోవడం వల్ల కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పై ప్రభావం పడిందని అంటున్నారు.