JanaSena: జనసేన( janasena ) ఆవిర్భావ దినోత్సవానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెలలో పిఠాపురంలో వేడుకగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాదిమంది జనసైనికులు హాజరవుతారని అంచనాలు ఉన్న నేపథ్యంలో.. అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జనసేనకు విజయం దక్కింది. అందుకే ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరపాలని జనసేన నాయకత్వం భావించింది. ఈ రాష్ట్రానికి దిశా నిర్దేశం చేసేలా పలు తీర్మానాలు ఉండనున్నాయి. అయితే ఇదే వేదికలో భారీగా చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read: మాజీ డిజిపికి అరుదైన చాన్స్.. ఎంతో నమ్మకంతో రెండు పదవులు ఇచ్చిన చంద్రబాబు!*
* నేతల రాజీనామా బాట
ఫలితాలు వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి చాలామంది నేతలు గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ సభ్యులు సైతం రాజీనామా చేశారు. అందులో కొందరు మాత్రమే కూటమి పార్టీలో చేరారు. మిగతావారు పొలిటికల్ జంక్షన్లో ఉన్నారు. ఏదో ఒక పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ కూటమి పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. అయితే జనసేనకు సంబంధించి చేరాలనుకున్న నేతలు ఆవిర్భావ దినోత్సవం నాడు చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
* ఆ ఎమ్మెల్సీలు సైతం
ఓ ఐదుగురు ఎమ్మెల్సీలు ఇప్పటికే పదవులు వదులుకున్నారు. కానీ వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు. సుంకర పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయ మంగళం వెంకటరమణ తదితర ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలో మర్రి రాజశేఖర్ సైతం రాజీనామా చేస్తారని ప్రచారం నడుస్తోంది. ఇంకోవైపు మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సైతం రాజీనామా చేసి ఉన్నారు. వీరిలో సగం మంది జనసేనలో చేరతారని ప్రచారం నడుస్తోంది. జనసేన ఆవిర్భావ సభలోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో ఎక్కువమంది చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
* ప్రకాశం జిల్లా నుంచి ప్రకాశంతో( Prakasam ) పాటు విశాఖ జిల్లాకు చెందిన చాలామంది నేతలు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లా కు సంబంధించి ఓ ఎమ్మెల్యే పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి సిద్దా రాఘవరావు జనసేనలోకి రప్పించేందుకు మాజీ మంత్రి బాలినేని ప్రయత్నిస్తున్నారు. రాఘవరావు టిడిపిలోకి వెళ్లాలనుకుంటున్నారు. కానీ అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. అందుకే జనసేనలోకి రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు హై కమాండ్ పై అసంతృప్తితో ఉన్నారు. ఆయన సైతం ఆవిర్భావ సభలోనే జనసేనలోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.