AP Government: ఏపీ ప్రభుత్వం( AP government ) దూకుడు మీద ఉంది. ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది. వాటి అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఒక్కో పథకానికి సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేస్తోంది. అందులో భాగంగా పేదల ఇంటి స్థలాలతో పాటు ఇళ్ల పంపిణీ పై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.14 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ మేరకు మంత్రి పార్థసారథి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన పేదల ఇళ్లను ఫిబ్రవరి 1న ప్రారంభించాలని నిర్ణయించారు. 1.14 లక్షల మంది లబ్ధిదారులకు వాటిని అందించనున్నారు. సీఎం చంద్రబాబు తణుకు నియోజకవర్గంలో తేతలిలో లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించనున్నారు. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు ఇళ్లను అందిస్తారు.
* వైసిపి ప్రభుత్వం వైఫల్యం
వైసీపీ( YSR Congress ) ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇళ్లను మంజూరు చేసింది. వాటిని పూర్తి చేయడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైంది. ఈ తరుణంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల నిర్మాణం పై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. చాలా రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. అప్పట్లో ప్రభుత్వం జగనన్న కాలనీల పేరిట గృహ నిర్మాణానికి పూనుకున్న సంగతి తెలిసిందే. అయితే నివాసయోగ్యం కానీ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు కేటాయించడం, ఇళ్లు మంజూరు చేయడం వంటి వాటితో లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే పాత ఇళ్ల నిర్మాణం పూర్తయితే కానీ.. కొత్తగా రాష్ట్రానికి గృహాలు మంజూరు చేసే ఛాన్స్ కనిపించకపోవడంతో.. కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని భావించింది. అందులో భాగంగానే ఫిబ్రవరి 1న లబ్ధిదారులకు వాటిని అందించాలని చూస్తోంది.
* మార్గదర్శకాలు తయారీ
మరోవైపు తాము అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్ల స్థలాలు( house sites) అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పట్టణ లబ్ధిదారులకు రెండు సెంట్లు, గ్రామీణ లబ్ధిదారులకు మూడు సెంట్లు చొప్పున స్థలం అందించేందుకు ప్రభుత్వం కసరత్ చేస్తోంది. అయితే ఇళ్ల స్థలాల కోసం విధివిధానాలు రూపొందించేందుకు రాష్ట్రస్థాయిలో రెవెన్యూ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ, జిల్లాలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేందుకు 900 కోట్లు విడుదలకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే జగనన్న కాలనీలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇకపై వాటిని ఎన్టీఆర్ కాలనీలో పేరుతో.. మిగతా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
* సర్వే పూర్తి
ఇళ్ల నిర్మాణానికి( housing) సంబంధించి ప్రభుత్వం సర్వే కూడా చేసింది. గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో వేరువేరుగా ఈ సర్వే సాగింది. గతంలో ఇంటి స్థలంతో పాటు ఇల్లు మంజూరు కానీ లబ్ధిదారుల వివరాలను అధికారులు,సిబ్బంది సేకరించారు. వారికి ఇంటి స్థలం తో పాటు ఇల్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం సైతం ఏపీకి భారీగా ఇళ్లను మంజూరు చేస్తోంది. అందులో భాగంగానే ముందుగా ఇంటి స్థలాల మంజూరు పై ఫోకస్ పెట్టింది. అందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించే పనిలో పడింది.