IBM Office In Visakhapatnam 2026: విశాఖపట్నం( Visakhapatnam) పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. గ్లోబల్ ఐటీ హబ్ గా అడుగులు వేస్తోంది. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు విశాఖకు తరలివస్తున్నాయి. ఇప్పటికే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ సంస్థ ఐబీఎం తన నూతన కార్యాలయాన్ని విశాఖలో ప్రారంభించింది. ప్రతిష్టాత్మకమైన లాన్సమ్ స్క్వేర్ భవనంలో ఏర్పాటు చేసింది. ప్రముఖ కో వర్కింగ్ స్పేస్ ప్రొవైడర్ ఇస్ఫ్రూట్ భాగస్వామ్యంతో ఈ సెంటర్ కార్యకలాపాలు కొనసాగునున్నాయి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ధ్రువీకరించారు. ఐబీఎం కంపెనీని సాగర నగరానికి సాదరంగా ఆహ్వానించారు. విశాఖకు ఐబీఎం రాకతో పూర్వ కళ వచ్చినట్లు అయింది. ఎందుకంటే దాని అనుబంధ సంస్థలన్నీ విశాఖకు వస్తాయి అన్నమాట.
* ఐటీ హబ్ గా విశాఖ..
విశాఖను ఐటీ హబ్( IT hub ) గా మార్చాలన్నది కూటమి ప్రభుత్వ ఆలోచన. గత రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం కూడా అదే. అయితే తాజాగా ఐబీఎం కంపెనీ విశాఖకు రావడం అనేది శుభపరిణామం. ఐబీఎం తన గ్లోబల్ డెలివరీ సెంటర్ల ద్వారా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, కన్సల్టింగ్ సేవలను అందిస్తుంది. తాజా సెంటర్ ప్రారంభంతో వందలాదిమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు స్థానికంగానే ఉపాధి లభించనుంది. ఐబీఎం అనుబంధ ఐటీ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడే ఛాన్స్ కనిపిస్తోంది. ఇకనుంచి ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని ఉండదు. భవిష్యత్తులో మరో పదేళ్ల కాలంలో విశాఖలో లక్షలాది ఉద్యోగాలను కల్పించగల శక్తి ఐటి పరిశ్రమలకు వస్తుంది.
* మంత్రి నారా లోకేష్ చొరవ..
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత.. లోకేష్( Nara Lokesh ) ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విశాఖలో పెట్టుబడులకు ఒక ఊపు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే పనిగా పెట్టుకుంది. ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ చొరవ అభినందనీయం. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం ఒకవైపు.. విదేశీ కంపెనీలతో సహృద్భావ చర్చలు మరోవైపు సాగించారు. దాని ఫలితంగానే ఐబీఎం వంటి కంపెనీలు తిరిగి విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధపడ్డాయి. కాగా ఐబీఎం కంపెనీకి సాదరంగా ఆహ్వానం పలుకుతూ నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Welcome to #Vizag, IBM! #ChooseSpeedChooseAP @IBM pic.twitter.com/tgZ1OLQAUS
— Lokesh Nara (@naralokesh) April 12, 2026