https://oktelugu.com/

Jagan: జగన్ మీద ఎంత నమ్మకం

Jagan జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కానీ చంద్రబాబు అమరావతిలో చేస్తారని టిడిపి నాయకుడు ఎవరు బలంగా చెప్పలేదు.

Written By:
  • Dharma
  • , Updated On : May 28, 2024 / 12:07 PM IST

    Jagan

    Follow us on

    Jagan: ఏపీలో యుద్ధ వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. గట్టి ఫైట్ నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా ఉండడంతో గెలుస్తామని టిడిపి కూటమి చెబుతోంది. ప్రభుత్వ సంక్షేమంతో వ్యతిరేకతను అధిగమించామని.. తప్పకుండా గెలుస్తామని వైసిపి చెబుతోంది. ఎవరి ధీమాలో వారు ఉన్నారు. జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అదే జూన్ 9న చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని టిడిపి నేతలు చెప్పుకొస్తున్నారు. అయితే ఈ విషయంలో వైసీపీ శ్రేణులు చాలా విశ్వాసంతో ఉన్నాయి. జగన్ పై అపార నమ్మకం పెట్టుకున్నాయి. అందుకే జూన్ 9న విశాఖ నగరంలో హోటల్లు, రిసార్ట్స్ బుక్ అయ్యాయి. అయితే అదంతా ఫేక్ అని టిడిపి ప్రచారం చేస్తోంది.

    ఇప్పుడు అంతా ఆన్లైన్ బుకింగ్.హోటల్లు, రిసార్ట్స్ లు ఇలా అన్నింటిని ఆన్లైన్లోనే బుక్ చేస్తున్నారు. అయితే జూన్ 9న విశాఖ నగరంలో ఏ హోటల్ చూసినా, ఏ రిసార్ట్స్ చూసినా ఖాళీగా లేవు. అది వేసవి విడిది పుణ్యమా? అని చెప్పలేం. కానీ ఒక్క హోటల్ కూడా ఖాళీగా లేకపోవడం టిడిపి కూటమికి కలవరపాటుకు గురిచేస్తుంది. అయితే కేవలం ప్రైవేట్ హోటల్స్, రిసార్ట్స్ యజమానులకు అలా చెప్పించే ప్రయత్నం చేశారని టిడిపి చెబుతోంది. అదే నిజమైతే రవాణాకు సంబంధించి విమాన, రైలు టికెట్లు సైతం పెద్ద ఎత్తున విశాఖకు బుక్ అయ్యాయి. అయితే ఇక్కడ గెలుపోటములను పక్కన పెడితే.. జగన్ పైన ఉన్న నమ్మకంతోనే వైసీపీ శ్రేణులు విశాఖ వచ్చేందుకు ఆరాటపడుతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది.

    జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కానీ చంద్రబాబు అమరావతిలో చేస్తారని టిడిపి నాయకుడు ఎవరు బలంగా చెప్పలేదు. ఇది కూడా వైసీపీ శ్రేణుల్లో నమ్మకం పెంచడానికి ఒక కారణం. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తామని బొత్స చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి విశాఖ వచ్చారు. దానిని సైతం టిడిపి భూతద్దంలో పెట్టి చూసింది. జనసేన నేత ఒకరైతే సిఎస్ సీఎం జగన్ ప్రమాణ స్వీకార ఏర్పాట్ల పర్యవేక్షణకు వచ్చారని ఆరోపించారు. అంటే ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాచారం ఉందని.. అందుకే గెలుస్తామన్న ధీమా ఉందని.. అందుకే విశాఖలో ప్రమాణస్వీకార ఏర్పాటు చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందుకే వైసిపి నేతలు విశాఖకు వచ్చేందుకు రవాణా ఏర్పాటు చేసుకున్నారు. వసతి ఏర్పాట్లు ముందస్తుగానే చేపట్టారు. ఒకవేళ జూన్ 4న అనుకూల ఫలితాలు వస్తే ఉత్సాహంగా వస్తారు. లేకుంటే అన్నింటిని రద్దు చేసుకుంటారు. అయితే వైసీపీలో ఆ నమ్మకం ప్రత్యర్థులకు మాత్రం ఆందోళన పుట్టిస్తోంది.