Boragadda Anil Kumar: బోరుగడ్డ అనిల్ కుమార్ ( boragadda Anil Kumar ) ఎట్టకేలకు లొంగిపోయారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి సరెండర్ అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. వ్యక్తిగత దూషణలకు దిగేవారు. బూతులతో మాట్లాడేవారు. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో బోరుగడ్డ అనిల్ కుమార్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీషీట్ నమోదు చేసి.. బోరుగడ్డను అరెస్టు చేశారు. గత నాలుగు నెలలుగా ఆయన పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. అయితే ఇటీవల తన తల్లి అనారోగ్యం పేరుతో బెయిల్ పొడిగించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మధ్యంతర బెయిల్ పొడిగించే ప్రసక్తి లేదని హైకోర్టు తేల్చి చెప్పడంతో.. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి లొంగిపోయారు.
Also Read: బొమ్మల పిచ్చితో దేన్నీ వదల్లే.. జగన్ పై లోకేష్ సంచలన కామెంట్స్!
* తల్లి అనారోగ్యం పేరుతో బెయిల్
ఇటీవల తన తల్లి( mother) అనారోగ్యం బాగాలేదని.. ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించాలని.. ఆపరేషన్ చేయించాలని కోర్టు ముందు విన్నవించారు అనిల్ కుమార్. ఈనెల 11 వరకు బెయిల్ పొందారు. అయితే ఆయన కోర్టుకు సమర్పించిన ధ్రువపత్రాలు ఫేక్ అంటూ ప్రచారం జరిగింది. బోరుగడ్డ అనిల్ కుమార్ గ్రేట్ ఎస్కేప్ అంటూ టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో ఆయన ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లతో ప్రాణహాని ఉందని సంచలన ఆరోపణలు చేశారు. తన తల్లి అనారోగ్యం రీత్యా మధ్యంతర బెయిల్ పొడిగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే బెయిల్ పొడిగించలేమని హైకోర్టు తేల్చి చెప్పడంతో.. మంగళవారం సాయంత్రం ఐదు గంటల లోపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి లొంగిపోయారు.
* కూటమి రావడంతో కష్టాలు
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రభుత్వ హయాంలో బోరుగడ్డ అనిల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. సోషల్ మీడియాతో పాటు పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలలో చాలా రకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రత్యర్థి పార్టీల నేతల కుటుంబ సభ్యుల గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు బోరుగడ్డ. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే బోరుగడ్డ అనిల్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే అనిల్ కామెంట్స్ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా అభ్యంతరాలు ఉన్నాయి. అటువంటి వారితోనే పార్టీకి ఎంతో నష్టం జరిగిందన్న వారు ఉన్నారు. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బోరుగడ్డ అనిల్ కుమార్ కు సహాయ నిరాకరణ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: ప్రజల చేతిలో ప్రభుత్వం.. ఏపీ ప్రభుత్వం మరో గొప్ప ముందడుగు