Heating Up Again in AP : ఏపీలో( Andhra Pradesh) వాతావరణం ఒక్కసారిగా మారింది. అంతటా ఎండలు మండుతున్నాయి. భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. అయితే మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే నైరుతి రుతుపవనాలు నెమ్మదించడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాబోయే మూడు రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే వర్షం తర్వాత ఒకేసారి ఉష్ణోగ్రతలు పెరగడంతో.. ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోతతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొద్దిరోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు.
* రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు( temperatures ) నమోదవుతున్నాయి. ఈరోజు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో 39 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలకు వర్ష సూచన ఉంది. మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.
Also Read : అమ్మ నిత్యానందా.. అదొక్కటే అనుకున్నాం.. ఈకళలోనూ ఆరితేరావా?
* ఒక్కసారిగా పెరిగిన వేడి..
రాష్ట్రంలో ఒక్కసారిగా వేడి పెరిగింది. సోమవారం ప్రజలు ఎండ వేడితో పాటు ఉక్కపోతతో అల్లాడిపోయారు. పల్నాడు( Palnadu ) జిల్లాలోని జంగమేశ్వరపురంలో అత్యధికంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పొడిగాలుల వల్ల రాష్ట్రంలో మళ్లీ వేడి పెరిగినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రానున్న మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా వందలాది ప్రాంతాల్లో 39 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయింది. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, కోస్తాలోని నరసాపురం, గన్నవరం, మచిలీపట్నం, కావలి, నెల్లూరు ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంది. వచ్చే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది.
* ముందుగానే రుతుపవనాలు..
అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళకు( Kerala) రుతుపవనాలు రావాలి. ఈ ఏడాది మే 23 నాటికి ప్రవేశించాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం విస్తరించాయి. వీటి ప్రభావంతో సాధారణం కంటే అధికంగానే వర్షాలు పడ్డాయి. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.