Heat Wave : ఏపీలో( Andhra Pradesh) ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చిలోనే ఇలా పరిస్థితి ఉంటే.. మేలో ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. వాస్తవానికి సంక్రాంతి తరువాత నుంచి ఎండల ప్రభావం పెరుగుతూ వచ్చింది. ఫిబ్రవరిలో అటు ఇటుగా ఉండేది. మార్చి నెలకు వచ్చేసరికి ఎండల తీవ్రత పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తోంది. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 108 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. మున్ముందు ఎండల తీవ్రత పెరుగుతుందని కూడా హెచ్చరించింది.
Also Read : జగన్ జిల్లాల పర్యటన ఎప్పుడు? ఉగాది తర్వాత లేనట్టేనా?
* ముందే హెచ్చరించిన వాతావరణ శాఖ..
గడిచిన 25 ఏళ్లలో కంటే ఈ ఏడాదిలోనే అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు( highest temperatures ) నమోదు అవుతాయని వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే పరిస్థితి ఉంది. సాధారణంగా ఏపీలో మార్చి నెలాఖరు నుంచి ఎండల తీవ్రత పెరగడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ ఏడాది సంక్రాంతి ముగిసిన నాటి నుంచే ఎండల ప్రభావం అధికంగా ఉంది. ప్రధానంగా రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్రలో సైతం సెగలు పుట్టిస్తున్నాయి.
* గడిచిన రెండు రోజులుగా..
గడిచిన రెండు రోజులుగా నంద్యాల( Nandyala), నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో 41 డిగ్రీల కంటే ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయింది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో సైతం 40 డిగ్రీలకు తక్కువ కాకుండా ఉష్ణోగ్రత నమోదు అవుతూనే ఉంది. ఏప్రిల్, మే నెలలో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని జనాలు అంచనాలు వస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేసుకోవడం విశేషం
* ఉదయం నుంచి రోడ్లు నిర్మానుష్యం..
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ( curfew) వాతావరణం తలపిస్తోంది. ఉదయం 9 గంటలకే రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఒడిస్సా నుంచి విదర్భ వరకు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్నిచోట్ల చల్లటి వాతావరణం ఉంది. ఈ నెలాఖరు వరకు వర్ష సూచన ఉంటుందని వాతావరణ శాఖ సూచించింది. కానీ మళ్లీ సాధారణ స్థితికి వాతావరణ పరిస్థితి చేరుకుంది. ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది.
Also Read : చెరో పదేళ్లు అధికారం.. కేటీఆర్ తో అసెంబ్లీలో కోమటిరెడ్డి డీల్!