Vallabhaneni Vamsi: వంశీ తరుపున లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ లపై సోమవారం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంగళవారం కోర్టు తీర్పు ఇవ్వనుంది. మరోవైపు వంశీకి ఇంటి నుంచి ఆహారం అందించాలనే పిటిషన్ ను ఎస్సీ ఎస్టీ కోర్టు విచారించింది. అటు ప్రభుత్వానికి, ఇటు వంశీ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది.. మరోవైపు గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై జరిగిన దాడి కేసులో సత్య వర్ధన్ పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడిని వల్లభనేని వంశీ అపహరించాడని.. బలవంతంగా డాక్యుమెంట్ లపై సంతకాలు పెట్టించుకున్నాడని ఆరోపణలు వినిపించాయి. అయితే సత్య వర్ధన్ ప్రస్తుతం కోర్టుకు వచ్చి తన వాంగ్మూలాన్ని చెప్పాడు. “నన్ను బెదిరించారు. అపహరించారు. తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. లేకపోతే ప్రాణాలకు ప్రమాదమని బెదిరించారు. అందువల్లే నేను వెనక్కి తగ్గాను. నా ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని” సత్య వర్ధన్ కోర్టు ఎదుట వెల్లడించిన తన వాంగ్మూలంలో చెప్పినట్టు తెలుస్తోంది.. ఒకవేళ సత్య వర్ధన్ వాంగ్మూలాన్ని కోర్టు తీవ్రంగా పరిగణిస్తే మాత్రం వల్లభనేని వంశీకి బెయిల్ రాదని తెలుస్తోంది. బెయిల్ రాని పక్షంలో పది రోజుల కస్టడీకి వంశీ వెళ్లాల్సి ఉంటుంది. ఆ కస్టడీలో పోలీసులు మరింత అనుబంధ చార్జి షీట్లు దాఖలు చేస్తే… ఇప్పట్లో వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది..
మంగళవారం నాడు ఉత్కంఠ
వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్ లపై మంగళవారం ఎస్సీ ఎస్టీ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. దీనిపై ఏపీవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. వల్లభనేని వంశీని అన్యాయంగా అరెస్ట్ చేశారని వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో.. మంగళవారం ఎస్సీ ఎస్టీ కోర్టు వెలువరించే తీర్పు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కోర్టు కనక వల్లభనేని వంశీకి అనుకూలంగా తీర్పు ఇస్తే.. కూటమి ప్రభుత్వానికి ఒకరకంగా షాక్ అని చెప్పవచ్చు. ఒకవేళ వల్లభనేని వంశీ పిటిషన్ ను కోర్టు కనక కొట్టి వేస్తే.. అతడు పది రోజులపాటు పోలీసుల కస్టడీకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే 10 రోజులతోనే పోలీసులు కస్టడిని ముగించరు. అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేసి.. మరింత సమయం కావాలని కోటిని అడుగుతారు. అప్పుడు కోర్టు కూడా పోలీసుల వాదనతో ఏకీభవించక తప్ప దు. అయితే ఇదంతా జరగకూడదని వంశీ తరుపున లాయర్లు కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎస్సీ ఎస్టీ కోర్టు ఎదుట బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దానికి తగ్గట్టుగా ఆధారాలు సమర్పించారు. అయితే ఎస్సీ ఎస్టీ కోర్టు వంశీని కస్టడీకి అప్పగిస్తుందా? లేదా బెయిల్ మంజూరు చేస్తుందా అనేది.. మరికొద్ది గంటల్లో తేలనుంది. అయితే వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో ఆదివారం ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. వంశీ తో పాటు కొడాలి నాని, పేర్ని నాని లను కూడా అరెస్టు చేసి తీరుతామని వ్యాఖ్యానించారు.. కచ్చితంగా వారిద్దరిని జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు. వారు చేసిన పాపాలే శాపాలుగా మారి ఇలా జైలు ఊచలు లెక్కపెట్టే పరిస్థితికి తీసుకొస్తున్నాయని వ్యాఖ్యానించారు.