Kalki 2 : ప్రభాస్ చేస్తున్న ప్రతి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెడుతున్నాయి… ఇక బాహుబలి తో 1900 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. నాగ్ అశ్విన్ లాంటి డైరెక్టర్ తో కల్కి సినిమా చేసి భారీ సక్సెస్ అందుకున్నాడు…. అప్పటి వరకు చిన్న సినిమాలను మాత్రమే హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న నాగ్ఆశ్విన్ ప్రభాస్ తో భారీ రేంజ్ లో సినిమా చేస్తున్నాడు అనగానే ప్రతి ఒక్కరికి ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది. ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది. నాగ్ అశ్విన్ ఈ సినిమాని సక్సెస్ చేస్తాడా? ప్రభాస్ ఈ సినిమాతో మరోసారి తన స్టామినాను చూపిస్తాడా లేదా అనే అనుమానాలు అయితే అందరికీ కలిగాయి. కానీ ఎట్టకేలకు అందరి అనుమానాలకు చెక్ పెడితే భారీ విజయాన్ని అందించే విధంగా కల్కి సినిమాని రూపొందించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ప్రస్తుతం ఆయన కల్కి 2 సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసి పెట్టాడు. అయితే ప్రభాస్ కల్కి 2 సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి మరొక సంవత్సర సమయం పట్టే అవకాశమైతే ఉంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు.
ఇక అది పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ (Spirit) అనే సినిమాని పూర్తి చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత ‘కల్కి 2’ (Kalki 2) సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ లో చేయాల్సిన సలార్ 2 (Salaar 2) సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనే అవకాశాలైతే ఉన్నాయి.
అయితే ఇదంతా జరగడానికి దాదాపు సంవత్సరం నుంచి సంవత్సరన్నర సమయం పట్టే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ గ్యాప్ లో నాగ్ అశ్విన్ రెండు చిన్న సినిమాలను చేయాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అందులో బాలయ్య బాబు కొడుకుతో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇక మరొక చిన్న సినిమాని కూడా డైరెక్షన్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడట.
పెద్ద సినిమాని చేసేటప్పుడు మళ్లీ చిన్న సినిమాలను పెట్టుకోవడం ఎందుకు అంటూ తన సన్నిహితులు తనని అడిగినప్పటికి భారీ సక్సెస్ సాధించే కంటే చిన్న సినిమాలతో కూడా అప్పుడప్పుడు సక్సెస్ లను సాధిస్తే మంచి కిక్ ఉంటుందని చెప్తున్నాడట… ఆయన సమయాన్ని ఏమాత్రం వేస్ట్ చేయకుడ్న ఖాళీగా ఉండకుండా తను కథలను రాసుకుంటూ గ్యాప్ లో చిన్న సినిమాలు చేస్తూ చిన్న హీరోలకి కూడా లైఫ్ ను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తను ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…