Pawan Kalyan Honest: పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) సినిమా ఫంక్షన్స్ లో చాలా తక్కువగా పాల్గొంటాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మూవీ సినిమా విషయం లో మాత్రం ఆయన ప్రొమోషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నాడు. నేడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో జరగనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నప్పటికీ కూడా ఆయన కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి, నిర్మాత AM రత్నం గురించి, సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. అంతే కాకుండా ఆయన ఇచ్చిన ప్రసంగం లో కొన్ని పాయింట్స్ ని ఇప్పుడు సోషల్ మీడియా లో యాంటీ ఫ్యాన్స్ బాగా తిప్పుతున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఆ మాటలే కనిపిస్తున్నాయి.
గతం లో తనతో 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే, వెయ్యి కోట్లు వస్తాయి లాంటి ప్రసంగాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఇతర హీరోలతో పోలిస్తే నాకు అంత మార్కెట్ లేదు అంటూ మాట్లాడడం గమనార్హం. ఆయన మాట్లాడుతూ ‘ఇతర హీరోలతో పోలిస్తే నాకు అంతగా బిజినెస్ జరగకపోవచ్చు. ఎందుకంటే నేను కేవలం సినిమా రంగం పైనే ఫోకస్ చేయలేదు. రాజకీయాల్లోకి వెళ్ళాను, నా ద్రుష్టి ఎక్కువగా అటు వైపే ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే ఆయనే పార్ట్ టైం హీరో అని ఒప్పేసుకున్నట్టే కదా, అందుకే సోషల్ మీడియా లో యాంటీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ నేడు ఇచ్చిన ప్రసంగం పై భిన్నమైన అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నీ రేంజ్ ఏంటో తెలుసుకున్నావు, సంతోషం అంటూ సోషల్ మీడియా లో దురాభిమనులు కామెంట్స్ చేస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం దీనికి ధీటుగా సమాధానం ఇస్తున్నారు.
Also Read: Pawan Kalyan Fish Venkat: పవన్ ఇచ్చిన 2 లక్షలు..ఫిష్ వెంకట్ చేసిన తప్పు.. అదే ప్రాణాలు తీసింది!
అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి పవన్ కళ్యాణ్ లాగానే ఉంటుంది, కానీ ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది. పవన్ కి తన బలమెంతో తెలియదు, ఇతర హీరోలు లాగా ఆయన బిజినెస్ లోకి తలదూర్చడు. తన పని తానూ చేసుకుంటూ పోతాడు. ‘హరి హర వీరమల్లు’ ఫైనాన్షియల్ సమస్యలు వచ్చాయంటే అందుకు కారణం, అది ఆరేళ్ళ క్రితం మొదలైన సినిమా, దానిపై మామూలు ఆడియన్స్ లో అంతగా ఆసక్తి లేదు. కానీ ఓజీ చిత్రానికి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 200 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది. #RRR , పుష్ప 2 తర్వాత అంతటి బిజినెస్ ని జరుపుకున్న చిత్రం ఇదే అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కానీ పవన్ అలా తనని తానూ తగ్గించుకొని మాట్లాడడం పై సోషల్ మీడియా లో ఆయన అభిమానులు తీవ్రమైన నిరాశని వ్యక్తం చేస్తున్నారు.
హీరోగా తన స్థాయి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ pic.twitter.com/aYkalo5Qmd
— Graduate Adda (@GraduateAdda) July 21, 2025