GVL Narasimha Rao: ఏపీ( Andhra Pradesh) బీజేపీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారందరికీ హై కమాండ్ వద్ద ఎంతో పరపతి ఉంది. అటువంటి నేతల్లో జీవీఎల్ నరసింహం ఒకరు. ఆయన రాజ్యసభ మాజీ ఎంపీ. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే దాకా ఆయన పేరు పెద్దగా తెలియదు. ఎన్నికల సర్వే, వ్యూహకర్తగా ఉండేవారు జీవీఎల్ నరసింహం. అలా భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యారు. 2014 ఎన్నికల్లో బిజెపి వ్యూహకర్తల బృందంలో ఆయన ఒకరు. అలా బిజెపిలోకి ఎంట్రీ ఇచ్చి జాతీయ అధికార ప్రతినిధి అయ్యారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అయితే ఏపీ నుంచి రాజకీయాలు చేయాలన్నది ఆయన వ్యూహం. అందుకు ఎంతగానో ప్రయత్నాలు చేశారు కానీ వర్కౌట్ కాలేదు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆయనకు కీలక బాధ్యతలు కట్టబెట్టింది.
* దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్..
దక్షిణాది రాష్ట్రాల్లో( South States) బలపడాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలను దక్షిణ రాష్ట్రాల నుంచి దక్కించుకోవాలని చూస్తోంది. సొంతంగా ఎదగాల్సిన చోట, మిత్రపక్షాల సహకారం ఉన్నచోట.. ఇలా ఓ 100 స్థానాలపై గురి పెట్టింది. అందుకు పక్కాగా ప్రణాళిక రూపొందిస్తోంది. కేంద్ర బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలకు ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. అయితే పథకాలతో పాటు నిధులు భారీగా ఇస్తోంది. కానీ అనుకున్న స్థాయిలో బిజెపికి పేరు రావడం లేదు. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర బడ్జెట్ తో పాటు సంక్షేమ పథకాల ప్రచార బాధ్యతను జివిఎల్ కు అప్పగించింది భారతీయ జనతా పార్టీ. తద్వారా పొలిటికల్ గా మరోసారి యాక్టివ్ అయ్యేలా ఉన్నారు జీవీఎల్ నరసింహం.
* త్వరలో రాజ్యసభకు?
వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని చూశారు జీవీఎల్( gvl Narasimham ). కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆయనకు అవకాశం చిక్కలేదు. రాష్ట్రంలో టిడిపి కూటమి, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో జివిఎల్ కు నామినేటెడ్ పోస్ట్ తప్పదని ప్రచారం నడిచింది.. కానీ 20 నెలలు అవుతున్న ఆయనకు అవకాశం చిక్కలేదు. ఈ తరుణంలో ఆయన అభిమానులు నిరాశతో ఉండేవారు. కానీ ఇప్పుడు బిజెపి హై కమాండ్ దక్షిణాది బాధ్యతలు అప్పగించడంతో జివిఎల్ కు ప్రాధాన్యత ఉంటుందని అర్థమవుతోంది. త్వరలో ఆయనకు రాజ్యసభ పదవి సైతం రాబోతోందని బిజెపి వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.