Homeఆంధ్రప్రదేశ్‌Governor post for TDP: టిడిపికి గవర్నర్ పోస్ట్.. చంద్రబాబు మనసులో ఆయనే!

Governor post for TDP: టిడిపికి గవర్నర్ పోస్ట్.. చంద్రబాబు మనసులో ఆయనే!

Governor post for TDP: ఏపీ(Andhra Pradesh) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం నుంచి రాజకీయంగా ప్రయోజనాలు పొందాలని టిడిపి భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు పొందేందుకు ప్రయత్నిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. బిజెపి కోరిన విధంగా ఏపీ నుంచి రాజ్యసభ పదవులు వదులుకుంది తెలుగుదేశం పార్టీ. అందుకే ఇప్పుడు తమకు సహకరించిన తెలుగుదేశం పార్టీకి గవర్నర్ పదవి ఇవ్వాలని బిజెపి నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై టిడిపికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. టిడిపి నాయకత్వం సైతం ఇద్దరు పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. వారిద్దరిలో ఒకరి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉంది. అదే జరిగితే మరో నేతకు రాజ్యసభ పదవి కట్టబెడతారని తెలుస్తోంది.

టిడిపికి ప్రాధాన్యం..
కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ(National democratic Alliance ) అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం తెలుగుదేశం. అందుకే కొత్తగా గవర్నర్ల నియామకం లో టిడిపికి ప్రాధాన్యం ఇవ్వాలని బిజెపి భావిస్తోంది. బీహార్ తో పాటు త్వరలో మూడు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బిజెపి జాతీయ అధ్యక్ష పదవి నుంచి అన్ని రకాల నియామకాలు పూర్తి చేయాలని బిజెపి హై కమాండ్ భావిస్తోంది. అందులో భాగంగా గవర్నర్ల నియామకం చేపట్టాలని చూస్తోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా జరగనుంది. అయితే ఈ నియామకాలన్నింటిలోనూ మిత్రపక్షాలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ముఖ్యంగా గవర్నర్ పదవి టిడిపికి ఇవ్వాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది. 2014లో సైతం టిడిపికి గవర్నర్ పదవి ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. కానీ రాజకీయ కారణాలతో చంద్రబాబు ఎంబీఏ నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఇది అమలు కాలేదు.

Also Read: బిడ్డల ప్రాణాల కోసం గిరిజనులు పోరాటం .. షాకింగ్ వీడియో

ఇద్దరి మధ్య పోటీ
ఇప్పుడు మరోసారి టిడిపికి గవర్నర్ పదవి( Governor post) ఇచ్చేందుకు బిజెపి నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే టిడిపి నుంచి ఇద్దరు సీనియర్ నేతలు గవర్నర్ పదవికి పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. రేసులో సీనియర్ నేత అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు ఉన్నారు. ఇద్దరిలో ఒకరి పేరు ఎంపిక చేశారు. అశోక్ గజపతిరాజుతోపాటు యనమల రామకృష్ణుడు తొలినుంచి టిడిపిలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు అండగా నిలిచారు. అసెంబ్లీ స్పీకర్లుగా, ఆర్థిక మంత్రులుగా వ్యవహరించారు. అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రివర్గంలో కూడా కొనసాగారు.

Also Read: ఆదివారం అమరావతిలో ఏం జరిగింది?

ఒకరికి రాజ్యసభ
తెలుగుదేశం( Telugu Desam) అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అశోక్ గజపతిరాజుతోపాటు యనమల రామకృష్ణుడుకు ప్రాధాన్యం దక్కుతూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం వారిద్దరికీ ప్రాతినిధ్యం లేదు. వారి బదులు కుమార్తెలు ఎమ్మెల్యేలుగా పోటీచేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొన్నటికి మొన్న యనమల ఎమ్మెల్సీ గా పదవీ విరమణ చేశారు. తనకు రాజ్యసభ పదవి ఇస్తే కొనసాగుతానని.. లేకుంటే రాజకీయాలనుంచి వైదొలుగుతానని యనమల స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు కేంద్రం నుంచి గవర్నర్ ఆఫర్ రావడంతో చంద్రబాబు అశోక్ గజపతిరాజు పేరు సూచించే అవకాశం ఉంది. యనమల రామకృష్ణుడు రాజ్యసభ పదవి ఇచ్చి గౌరవిస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే గవర్నర్ ఎంపికకు సంబంధించి పార్టీలో అందరి అభిప్రాయాన్ని తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular