MLC Election Results: మరో ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం వెల్లడయింది. గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. మూడు రోజుల కిందట పోలింగ్ జరిగింది. ఈరోజు ఉదయం నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. పిడిఎఫ్ అభ్యర్థిగా బరిలో దిగిన గోపి మూర్తి మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. గోపి మూర్తి ఎనిమిది వేలకు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించారు. పోలైన ఓట్లను బట్టి ఆయనకు 7745 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. అయితే ఇప్పటివరకు గోపి మూర్తికి 9163 కు పైగా ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి గంధం నారాయణరావుకు 5008 ఓట్లు రావడంతో గోపి మూర్తి విజయం ఖాయమైంది.
* ప్రారంభం నుంచి హవా
ఉదయం లెక్కింపు ప్రారంభం నుంచి గోపి మూర్తి హవా చాటుతున్నారు. అన్ని టేబుల్స్ లోనూ ఆయనకు ఆధిక్యత ఓట్లు లభిస్తున్నాయి. టేబుల్ కు వెయ్యి చొప్పున బ్యాలెట్ లను కట్టలు కట్టి లెక్కింపు మొదలుపెట్టారు. మొదటి టేబుల్ లో వెయ్యి ఓట్లలో గోపి మూర్తికి 665, రెండో టేబుల్లో 665, మూడో టేబుల్ లో 607, 4వ టేబుల్ లో 698, ఆరువ టేబుల్ లో 580, 8వ టేబుల్ లో 585, 9వ టేబుల్ లో 544, పదో టేబుల్లో 581, 11వ టేబుల్ లో 556, 12వ టేబుల్ లో 607, 13వ టేబుల్ లో 54,14వ టేబుల్లో 666 ఓట్లను గోపి మూర్తి సాధించారు.ఇంకా 5వ టేబుల్ కు సంబంధించి ఓట్లు లెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గోపి మూర్తి విజయం సాధించినట్లు సమాచారం.
* పక్కాగా ఏర్పాట్లు
కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అయితే గోపి మూర్తి విజయం దాదాపు ఖరారు అయ్యింది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా గోపి మూర్తి రంగంలోకి దిగారు. ఇండిపెండెంట్ గానే పోటీ చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రచారం జరిపారు అభ్యర్థులు. చివరకు గోపి మూర్తికి విజయం వరించింది.