https://oktelugu.com/

R Krishnaiah: బిజెపి నుంచి కృష్ణయ్య.. ముగ్గురితో రాజ్యసభ జాబితా!

రాజ్యసభ ఉప ఎన్నికకు సంబంధించి.. నోటిఫికేషన్ గడువు సమీపిస్తోంది. రేపు సాయంత్రం తో ముగియనుంది. అయితే ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్య పేరును ఖరారు చేసింది భారతీయ జనతా పార్టీ

Written By:
  • Dharma
  • , Updated On : December 9, 2024 / 04:43 PM IST

    R Krishnaiah

    Follow us on

    R Krishnaiah: రాజ్యసభ అభ్యర్థుల విషయంలో ఫుల్ క్లారిటీ వస్తోంది. ఈరోజు బిజెపి తన అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య పేరు కూడా ఉంది. ఆయన పేరును ఏపీ నుంచి పోటీ చేసే జాబితాలో విడుదల చేసింది బిజెపి. అలాగే హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిస్సా నుంచి సుజిత్ కుమార్ ను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. ఏపీ నుంచి ముగ్గురు వైసీపీ సభ్యుల రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు పార్టీకి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేశారు. కృష్ణయ్య బిజెపికి దగ్గరయ్యారు. మిగతా ఇద్దరూ టిడిపిలో చేరారు.అయితే బిజెపి తాజాగా రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. అందులో కృష్ణయ్య పేరు ఉంది. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ పై పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ముందస్తు ఒప్పందం మేరకు బీదా మస్తాన్ రావు పేరును టిడిపి ఖరారు చేసే అవకాశం ఉంది. మరో పదవి కూడా టిడిపికి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. సానా సతీష్ పేరు ఖరారు అయినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం టిడిపి అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

    * బీసీ నేతగా గుర్తింపు
    కృష్ణయ్య జాతీయ బీసీ సంఘం నేత. ఆయనకు దేశవ్యాప్తంగా బీసీల్లో పట్టుంది. తెలంగాణకు చెందిన కృష్ణయ్య 2014లో టిడిపి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అప్పట్లో రాష్ట్ర విభజన జరగడంతో టిడిపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కృష్ణయ్య పేరును ప్రకటించింది. అయితే ఆ ఎన్నికల్లో 15 వరకు సీట్లు టిడిపికి వచ్చాయి. కానీ ఫలితం లేకపోయింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్ రకరకాల ప్రయోగాలు చేశారు. బీసీ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. అందులో భాగంగా బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇచ్చారు. అయితే బీసీ నినాదం అనేది ఎన్నికల్లో పనిచేయలేదు. అదే సమయంలో కృష్ణయ్యను ఆకర్షించాలని బిజెపి చూసింది. ఆయనతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయించింది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి ఆయనతోనే పోటీ చేయిస్తోంది భారతీయ జనతా పార్టీ.

    * మెగా బ్రదర్ పేరు వినిపించినా
    వాస్తవానికి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నాగబాబు పేరు ప్రధానంగా వినిపించింది. అసలు బిజెపికి ఛాన్స్ లేదని ప్రచారం జరిగింది. ఆ మూడు స్థానాల్లో రెండింటిని టిడిపి, ఒకటి జనసేనకు కేటాయిస్తారని ప్రచారం నడిచింది. మెగా బ్రదర్ నాగబాబు కు చాన్స్ ఇస్తారని కూడా తెగ హడావిడి నడిచింది. అయితే ఇప్పుడు చివరి నిమిషంలో టిడిపికి రెండు, బిజెపికి ఒకటి అని తేలిపోయింది. బిజెపి నుంచి ఆర్ కృష్ణయ్య.. టిడిపి నుంచి బీదా మస్తాన్ రావు పేర్లు దాదాపు ఖరారు అయ్యాయి. అయితే మిగిలిన ఆ ఒక్క స్థానం టిడిపికి ఇస్తారా? ఆ పార్టీ నుంచి సానా సతీష్ బరిలో దిగుతారా? లేకుంటే ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.