Jagan: వైసీపీకి ఆ ఆరుగురు మాజీ మంత్రులు గుడ్ బై.. జగన్ కు వీర విధేయుడు కూడా!

జగన్ అంటే వైసీపీ నేతలు ఒక రకమైన భక్తి ఉండేది. ఆయన ఆదేశిస్తే నదిలో దూకేయమన్నా దూకుతామన్న నేతలకు కొదువ లేదు. కానీ అటువంటి నేతలే ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధపడుతుండడం విశేషం.

Written By: Dharma, Updated On : November 5, 2024 1:18 pm

YS Jaganmohan Reddy

Follow us on

Jagan: వైసీపీకి ఆరుగురు మాజీ మంత్రులు గుడ్ బై చెప్పనున్నారా? అందులో జగన్ కు అత్యంత విధేయులు ఉన్నారా? అనిల్ కుమార్ యాదవ్ సైతం వైసీపీని వీడనున్నారా? వైసీపీలో ఉంటే వీరంతా భవిష్యత్తు లేదని భావిస్తున్నారా?అందుకే దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్,జోగి రమేష్ తో పాటు మరో నలుగురు పార్టీకి గుడ్ బై చెబుతారని ప్రచారం జరుగుతోంది. అది కూడా వైసిపి అనుకూల మీడియాల నుంచి జరుగుతుండడం విశేషం. అక్కడ నుంచే లీకులు బయటకు వస్తున్నాయి.అయితే వైసీపీ సీనియర్లు ఎంత ప్రయత్నించినా పెద్దగా వారి నుంచి స్పందన రాలేదని తెలుస్తోంది. వారు పార్టీ మారే విషయంలో సీరియస్ గా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.జోగి రమేష్తనతోపాటు కుటుంబ సభ్యులపై కేసులు వెంటాడుతుండడంతో వీలైనంత త్వరగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోవాలని చూస్తున్నట్లు సమాచారం. అనిల్ కుమార్ యాదవ్ సైతం పార్టీ మారకపోతే తనకు భవిష్యత్తు ఉండదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాను తన స్థాయిని మించి వ్యవహరించానని.. జగన్ కు పావుగా మారిపోయానని అనిల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రెడ్డి నేతల కోసం తనను బలి పశువు చేశారన్న ఆవేదనతో ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్.అందుకే పార్టీ మారిపోవడమే ఉత్తమమని భావిస్తున్నారు.అన్నింటికీ మించి జనసేన తనకు సేఫ్ జోన్ అని అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

* వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా
2014,2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. 2014లో వైసిపి ప్రతిపక్షానికి పరిమితం అయినా.. అనిల్ మాత్రం చాలా దూకుడుగా వ్యవహరించేవారు. రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు. ముఖ్యంగా చంద్రబాబు తో పాటు పవన్ ను టార్గెట్ చేసుకునేవారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్ పిలిచి మరి అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రి పదవి ఇచ్చారు. రెడ్డి నేతలకు కాదని తనకు మంత్రి పదవి ఇచ్చేసరికి అనిల్ రెచ్చిపోయారు.ఇక తనదే అంత అన్నట్టు వ్యవహరించారు.కానీ విస్తరణలో మంత్రి పదవి పీకేశారు జగన్. ఈ ఎన్నికల్లో నెల్లూరు సిటీ టికెట్ కూడా ఇవ్వలేదు. నరసరావుపేట ఎంపీ స్థానానికి పంపించారు. అయిష్టతగానే అక్కడకు వెళ్లిన అనిల్.. దారుణ పరాజయం చూశారు.

* జగన్ కు వీర విధేయుడు
జగన్ పై ఈగ వాలనిచ్చేవారు కాదు అనిల్ కుమార్ యాదవ్. అయితే తనకు జగన్ మంచి లైఫ్ ఇచ్చారని ఆయన భావించేవారు. కానీ ఇప్పుడు అసలు సీన్ కనిపిస్తోంది అనిల్ కుమార్ యాదవ్ కు. తనను వాడుకున్నారు అన్న విషయాన్ని గ్రహించారు. అందుకే ఎంత మాత్రం పార్టీలో ఉండడం శ్రేయస్కరం కాదని భావిస్తున్నారు. జనసేన అధినేత పవన్ ను వ్యక్తిగతంగా ద్వేషించి ఇబ్బంది పడ్డానని తెలుసుకున్నారు. ఇప్పుడు అదే జనసేనలో చేరేందుకు అనిల్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు మాజీ మంత్రులే కాదు.. మరో నలుగురు సైతం పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి వారు ఎవరో ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.