Vallabhaneni Vamshi Arrest : నాడు మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో దాడి వెనుక వల్లభనేని వంశీ ఉన్నారని.. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసే సత్య వర్ధన్ అనే వ్యక్తి కేసు పెట్టారు.. అయితే ఆ కేసును అతను విత్ డ్రా చేసుకున్నారు.. వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించడం వల్లే సత్య వర్ధన్ కేసు విత్ డ్రా చేసుకున్నారని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆ కేసులోనే వల్లభనేని వంశీని అరెస్టు చేశారని చెబుతున్నాయి.. నాడు కేంద్ర కార్యాలయం పై దాడి జరిగినప్పుడు.. వైసిపి శ్రేణులు ఇష్టానుసారంగా వ్యవహరించాయని.. కేంద్ర కార్యాలయంలోకి ప్రవేశించి సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశాయని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. నాడు కేంద్ర కార్యాలయం పై దాడి చేసి బీభత్సం సృష్టించారని.. ఇప్పుడు వారి పాపం పండిందని.. పిల్ల సైకోలకు తగిన శాస్తి జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
విజయవాడకు తరలింపు
వల్లభనేని వంశీని హైదరాబాదులో అరెస్టు చేసి.. ఆంధ్రప్రదేశ్ పోలీసులు విజయవాడకు తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది..” నాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై మీ దర్శకత్వంలోనే దాడులు జరిగాయి. దీనికి సంబంధించి మాకు ఫిర్యాదులు అందాయి. చివరికి ఫిర్యాదు చేసిన వ్యక్తిని కూడా మీరు కిడ్నాప్ చేశారు. అతడిని కేసు విత్ డ్రా చేసుకోవాలని బెదిరించారు. అందువల్లే అతడు కేసు విత్ డ్రా చేసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని అదే వ్యక్తి మాకు ఫిర్యాదు రూపంలో తెలియజేశాడు. అందువల్లే మిమ్మల్ని అరెస్టు చేయాల్సి వస్తోంది. మీరు, మీ పార్టీ నాయకులు మాకు సహకరించాలి. మీ అరెస్టుకు సంబంధించి మా వద్ద వారంట్ కూడా ఉంది.. చట్ట ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మీరు మాకు సహకరించాలని” పోలీసులు వల్లభనేని వంశీతో పేర్కొన్నట్టు తెలుస్తోంది. మొదట్లో వల్లభనేని వంశీ పోలీసులతో వారించినప్పటికీ.. ఆ తర్వాత వారితోపాటు విజయవాడ బయలుదేరినట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షలు విజయవాడ మెజిస్ట్రేట్ ఎదుట వల్లభనేని వంశీని పోలీసులు హాజరు పరుస్తారని తెలుస్తోంది. మరోవైపు వల్లభనేని వంశీ అరెస్టును వైసిపి నాయకులు తప్పుపడుతున్నారు. సత్య వర్ధన్ కేసు విత్ డ్రా చేసుకున్నప్పటికీ.. తెలుగుదేశం కేంద్ర పార్టీ కార్యాలయం పై జరిగిన దాడి కేసులో వంశీని అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో వంశీ అరెస్టు నేపథ్యంలో అటు టిడిపి, ఇటు వైసిపి నాయకులు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. వంశీ అరెస్టు నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఏపీ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.