Gali Janardhan Reddy : ఓబులాపురం మైనింగ్ కేసులో( Obulapuram mining case ) ఏడేళ్ల పాటు గాలి జనార్దన్ రెడ్డికి జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఇటీవల నాంపల్లిలోని సిబిఐ కోర్టు తీర్పు చెప్పింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఓ ఐదుగురికి శిక్ష విధించింది. తాజాగా గాలి జనార్దన్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీ స్పీకర్ గెజిట్ జారీ చేశారు. గంగావతి అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా ప్రకటించారు. ఇప్పుడు ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా ప్రస్తానాన్ని ప్రారంభించిన గాలి జనార్దన్ రెడ్డి అంచలంచలుగా ఎదుగుతూ మైనింగ్ మాఫియాకు కింగ్ గా ఎదిగారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కొండలను, గుట్టలను కొల్లగొట్టి దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పుడు జైలుకు వెళ్లారు. ఇప్పుడు ఆయనకు ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోయింది.
Also Read : ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి.. నెక్స్ట్ టార్గెట్ ఎవరు?
* అనతి కాలంలో ఎదిగి..
ఓ ఇన్సూరెన్స్ కంపెనీ( Insurance Company) ఏజెంట్ గా ఉండేవారు గాలి జనార్దన్ రెడ్డి. ఆయనకు కరుణాకర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి అనే సోదరులు ఉన్నారు. బళ్లారిలో తన ఆధిపత్యాన్ని పెంచుకుంటూ వచ్చారు గాలి సోదరులు. పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. దశాబ్ద కాలం పాటు రాజకీయాలను సైతం శాసించారు. కర్ణాటక తో పాటు ఏపీ రాజకీయాల్లో సైతం తమ ప్రభావాన్ని చాటుకున్నారు. 1999లో అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు గాలి సోదరులు. ఆ ఎన్నికల్లో అనూహ్యంగా బిజెపికి దగ్గరయ్యారు. ఆ ఎన్నికల్లో బళ్లారి నుంచి నాటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేశారు. ఆమెపై బీజేపీ అభ్యర్థిగా దివంగత సుష్మా స్వరాజ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ కు మద్దతుగా ప్రచారం చేశారు గాలి సోదరులు. అయితే సుష్మా స్వరాజ్ ఓడిపోయినప్పటికీ.. బిజెపి పెద్దలకు దగ్గరయ్యారు గాలి సోదరులు.
* బళ్లారి బిజెపి కంచుకోటగా..
బిజెపిలో చేరిన గాలి సోదరులు బల్లారి( Ballary district) జిల్లాను ఆ పార్టీకి కంచుకోటగా మార్చారు. 2001లో తొలిసారిగా బళ్లారి మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటింది. 2004లో కర్ణాటక చరిత్రలోనే తొలిసారి అక్కడ బిజెపి నుంచి ఎంపీ అభ్యర్థి గెలిచారు. 2005 నుంచి వరుసగా మూడుసార్లు బళ్లారి జిల్లా పరిషత్ సీటును బిజెపి గెలుచుకుంది. అలా బిజెపిలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు గాలి జనార్దన్ రెడ్డి. 2006లో బిజెపి, జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. అందులో తన అనుచరుడు శ్రీరాములను మంత్రి పదవి పెంచుకున్నారు. 2006లో ఎమ్మెల్సీ అయ్యారు జనార్దన్ రెడ్డి. 2008లో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యారు. దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి తొలిసారిగా అధికారంలోకి రావడం అదే తొలిసారి. అలా యడ్యూరప్ప ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉండేవారు గాలి జనార్దన్ రెడ్డి.
Also Read : గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ క్రిటికల్.. జేడీ లక్ష్మీనారాయణ!
* పార్టీ ఏర్పాటు చేసి బిజెపిలో విలీనం..
2023 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీకి( Bhartiya Janata Party) గుడ్ బై చెప్పారు గాలి జనార్దన్ రెడ్డి. కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష పార్టీని ఏర్పాటు చేశారు. గంగావతి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు తన పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. తిరిగి బిజెపిలో చేరారు. అయితే ఆయనపై నమోదైన ఓబులాపురం మైనింగ్ కేసులో.. ఏడేళ్ల పాటు సిబిఐ కోర్టు శిక్ష విధించడంతో.. గాలి జనార్దన్ రెడ్డి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. మరో పదేళ్లపాటు ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావాల్సిందే.