https://oktelugu.com/

Unstoppable: అల్లు అర్హ చెప్పిన పద్యం వింటే ఆశ్చర్యపోతారు..తెలుగు హీరోయిన్లు ఈ చిన్నారిని చూసి చాలా నేర్చుకోవాలి!

రీసెంట్ గా వీళ్లిద్దరు అల్లు అర్జున్ తో కలిసి ఆహా మీడియా లో బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్ 4' లో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించి పార్ట్ 1 ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 19, 2024 / 05:48 PM IST

    Unstoppable

    Follow us on

    Unstoppable: అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కి సోషల్ మీడియా లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పుడప్పుడు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి అర్హ కి సంబంధించిన క్యూట్ వీడియోలను, ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటారు. అవి బాగా వైరల్ అవ్వడంతో అర్హ కి మంచి క్రేజ్ ఏర్పడింది. కొడుకు అల్లు అయాన్ కూడా మంచి పాపులర్. రీసెంట్ గా వీళ్లిద్దరు అల్లు అర్జున్ తో కలిసి ఆహా మీడియా లో బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ 4’ లో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించి పార్ట్ 1 ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. అల్లు అర్జున్,బాలయ్య మధ్య జరిగిన సరదా చిట్ చాట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే షోలో అల్లు అర్జున్ అమ్మగారు కూడా పాల్గొన్నారు. తన బిడ్డ అల్లు అర్జున్ తో చిన్నప్పటి నుండి ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను షేర్ చేసుకొని కాసేపు తన విలువైన సమయాన్ని పంచుకుంది.

    ఈ ఎపిసోడ్ కి సంబంధించిన రెండవ భాగం ఈ నెల 22న ఆహా యాప్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రోమో లో బాలయ్య ముందుగా అర్హతో మాట్లాడుతూ ‘అర్హ నీకు తెలుగు వచ్చా అమ్మా’ అని అడగగా, దానికి అల్లు అర్జున్ సమాధానం చెప్తూ ‘తెలుగు వచ్చా, ఇప్పుడు చూడండి సార్’ అని అంటాడు. అప్పుడు అర్హ నాన్ స్టాప్ గా నిమిషం పాటు ఒక పద్యాన్ని ఎలాంటి గ్రామర్ మిస్టేక్ లేకుండా స్వచ్ఛమైన తెలుగులో చెప్తుంది. దీనికి బాలయ్య షాక్ కి గురి అవుతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకొని ‘తెలుగు చల్లగా..నాలుగు కాలాల పాటు హాయిగా..ఈ భూమి మీద బ్రతికి ఉంటుందని అనిపిస్తుంది’ అని అంటాడు.

    ఆ తర్వాత బాలయ్య అర్హ తో మాట్లాడుతూ ‘ఏ క్లాస్ చదువుతున్నావ్?’ అని అడగగా, దానికి అర్హ సమాధానం చెప్తూ ‘సెకండ్ క్లాస్’ అంటుంది. అప్పుడు బాలయ్య నేను ఫస్ట్ క్లాస్ అని అంటాడు. ఇక ఆ తర్వాత బాలయ్య అల్లు అయాన్ తో మాట్లాడుతూ ‘మీ నాన్న ప్రేమ మొత్తం మీ చెల్లి మీదనే అంటాడు’. ఆ తర్వాత అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఎనిమల్ చిత్రంలో రణబీర్ కపూర్ లాంటోడు సార్ వీడు. వాళ్ళ నాన్న కోసం ఏదైనా చేసేస్తాడు’ అని అంటాడు. అయితే ఈ ప్రోమో చివర్లో బాలయ్య దేవిశ్రీ ప్రసాద్ కి ఫోన్ చేయగా, పుష్ప 2 గురించి ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ చెప్తాను సార్ అంటాడు. అప్పుడు అల్లు అర్జున్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి, నాయనా నువ్వు అప్పుడే అన్ని లీక్స్ ఇవ్వకు అని అంటాడు. ఇంతకీ ఆ సీక్రెట్ ఏమిటి అనేది తెలియాలంటే 22వ తేదీ వరకు ఆగాల్సిందే.