Free Bus Passes: విద్యా సంవత్సరం( academic year ) ప్రారంభం అయింది. పాఠశాలలు తెరుచుకున్నాయి. వేసవి సెలవుల తర్వాత విద్యాసంస్థలు తెరవడంతో విద్యార్థులు రాక ప్రారంభం అయింది. అడ్మిషన్లు సైతం జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పాసులు జారీకి నిర్ణయించింది. పాత బస్సు పాసు స్థానంలో కొత్త వాటిని ఇచ్చేందుకు నిర్ణయించింది. పాఠశాల విద్యార్థులతో పాటు డిగ్రీ, ఇంటర్ విద్యార్థులకు సైతం రాయితీ పాసులు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో రాయితీ బస్సు పాసులకు సంబంధించి వివరాలు ఉన్నాయి. ఆ సైట్ ను సందర్శించి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పదో తరగతి వరకు చదివే పిల్లలకు ఉచిత పాసులు.. ఆపై చదివే విద్యార్థులకు రాయితీ పాసులు అందిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ.
* బస్ పాసుల జారీ
ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఆర్టీసీ( APSRTC) ఉచిత, రాయితీ పాసులు అందివ్వడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈనెల 13 నుంచి అన్ని డిపోల వద్ద దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే పాత పాస్ లు ఉన్నవారు వాటిని మార్చుకొని.. కొత్త పాస్ లు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు నెల, మూడు నెలలు, ఏడాది కాలానికి చెల్లుబాటయ్యే పాస్ లు డబ్బులు చెల్లించి తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు ఆన్లైన్లో సైతం దరఖాస్తు చేసుకునే విసులుబాటు కల్పించారు. మొబైల్ ఫోన్ నుంచి apsrtconline.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* పాఠశాల విద్యార్థులు బస్సు పాసుల కోసం హెడ్మాస్టర్( headmaster ) సంతకం చేసిన దరఖాస్తు ఫారం తీసుకోవాలి. ఆధార్ కార్డు కాపీ, పాస్పోర్ట్ సైజు ఫోటోను ఆర్టీసీ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. వీటిని తీసుకొని డిపోల్లోని బస్సు పాస్ కౌంటర్లో సంప్రదిస్తే.. కొత్త బస్ పాస్ లు అందిస్తారు.
Read Also: మరో ఆరు రోజుల్లో టెస్ట్ సిరీస్ మొదలు.. ఇంగ్లీష్ గడ్డపై గిల్ సరికొత్త అవతారం: (వీడియో)
* అయితే బస్సు పాస్( bus pass ) జారీలో ఓటిపి విధానం అమలు చేస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
* పాఠశాలలు తెరుచుకున్న క్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర పేరిట కిట్లు అందజేశారు. యూనిఫామ్ తో పాటు బూట్లు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, డిక్షనరీ కూడిన కిట్లు అందజేశారు.
* మధ్యాహ్న భోజన( Mid day meals ) పథకంలో భాగంగా సన్న బియ్యంతో ఆహారాన్ని అందించారు. ఇప్పటికే ప్రాంతాలవారీగా ఆహార మెనూ సిద్ధం చేశారు.
* పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ చేశారు.
* ఇప్పుడు ఆర్టీసీ ఉచిత, రాయితీ పాసులు జారీకి శ్రీకారం చుట్టారు.