Novak Djokovic : ఫెదరర్ వల్ల కానిది, నాదల్ చేయలేనిది జకోవిచ్ చేసి చూపించాడు. కొన్ని సందర్భాలలో ఫెదరర్, నాదల్ ఏకపక్షంగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు.. జకోవిచ్ ప్రత్యామ్నాయంగా వచ్చాడు. తానే ఒక శక్తిగా ఆవిర్భవించాడు. తద్వారా నాదల్, పెదరర్ సరసన చేరి.. టెన్నిస్ లో సూపర్ త్రయంగా నిలిచాడు.. వాస్తవానికి నాదల్ కంటే ఏడాది జకోవిచ్ చిన్నవాడు. ఫెదరర్ కంటే ఐదు సంవత్సరాలు చిన్నవాడు. అప్పటికి జకోవిచ్ టెన్నిస్లో వీరిద్దరిని అనేక సందర్భాలలో బీట్ చేశాడు. నాదల్ నెలకొల్పిన రికార్డులను బద్దలు కొట్టాడు. ఫెదరర్ సృష్టించిన అద్భుతాలను బ్రేక్ చేశాడు. 2011లో తొలిసారిగా నెంబర్ వన్ స్థానానికి వచ్చాడు. బలమైన ఫోర్ హాండ్ షాట్లు కొట్టడంలో.. బ్యాక్ అండ్ సర్వీస్ బ్రేక్ చేయడంలో జకోవిచ్ దిట్ట. అందువల్లే అతడు టెన్నిస్ చరిత్రలో యోధుడిగా మిగిలిపోయాడు. శరీర సామర్థ్యాన్ని కాపాడుకోవడంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పిన జకోవిచ్.. ఎంతోమందికి ప్రేరణగా నిలిచాడు. అయితే అతడు అనేక సందర్భాలలో భావోద్వేగానికి గురైనప్పటికీ.. తన లోపల ఉన్న భావాలను మాత్రం ఎన్నడు బయట పెట్టలేదు. అయితే తొలిసారిగా జకోవిచ్. తన మనసులో గూడు కట్టుకున్న బాధను మొత్తం ఒకసారిగా బయటపెట్టాడు. ఒకరకంగా చిన్నపిల్లాడి మాదిరిగా కన్నీటి పర్యంతమయ్యాడు.
నైపుణ్యం చూపించినప్పటికీ
టెన్నిస్లో తాను అద్భుతమైన ప్రతిభను చూపించినప్పటికీ.. అనితర సాధ్యమైన నైపుణ్యాన్ని ప్రదర్శించినప్పటికీ అభిమానుల ప్రేమను మాత్రం పొందలేకపోయానని జకో విచ్ పేర్కొన్నాడు. ఒకానొక సందర్భంలో తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని పిల్లాడి మాదిరిగా అయిపోయాను ఏంటి అనుకునేవాడినని జకోవిచ్ పేర్కొన్నాడు. కొన్ని సందర్భాలలో నా ప్రవర్తనను గనుక నేను మార్చేసుకుంటే అభిమానుల ప్రేమ లభిస్తుందేమోనని అనుకునేవాడినని అతడు పేర్కొన్నాడు.” నా తీరు అప్పుడు అలా ఉండేదేమో.. తల్లిదండ్రులకు ఇష్టం లేని సంతానం లాగా నాకు అనిపించేది. నా తీరు మార్చుకోవాలని అనుకున్నాను. అప్పటికైనా అభిమానుల ఆదరణ దక్కుతుందని భావించాను. నా దురదృష్టమేమో తెలియదు కాని.. ఫెదరర్, నాదల్ స్వీకరించిన ప్రేమను నేను అభిమానుల నుంచి గ్రహించలేకపోయాను. బహుశా నన్ను తక్కువ స్థాయి వ్యక్తిలాగా వారు ఊహించి ఉంటారు. అందువల్లే ఆ స్థాయిలో ప్రేమను చూపించలేకపోయారు. నేను అనేక సందర్భాలలో నెంబర్ వన్ అవుతానని ప్రకటించాను. నేను చేసిన ప్రకటన చాలామందికి నచ్చకపోవచ్చు.. అందువల్లే అలాంటి పనిచేసారేమోనని అనుకుంటున్నానని” జకోవిచ్ పేర్కొన్నాడు..
అపాయం ఉండదు
“నేను టెన్నిస్ లో పోటీ మాత్రమే ఉంటుందని భావిస్తాను. ప్రత్యర్థులకు అపాయం తలపెట్టానే ఆలోచన నాకు ఉండదు. ప్రత్యర్థులపై ద్వేషం నేను ప్రదర్శించలేదు. నేను మాత్రమే పైచేయి సాధించాలని అనుకోలేదు. దానికోసం ఎలాంటి మయోపయాలకు పాల్పడాలని భావించలేదు. అలా చేస్తే ఎక్కువ కాలం నిలబడలేం. ఆ స్థాయిలో నిలబడ్డానంటే కేవలం కష్టం వల్లే, ప్రతిభ ఉండడం వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను. నాకు ఫెదర్ అంటే గౌరవం ఉంటుంది. నాదల్ అంటే ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మేము ఒకే కాలంలో త్రయంగా ఎదిగామని” జకో విచ్ పేర్కొన్నాడు.