Siveri Suresh Kumar: ఏపీ ప్రభుత్వం( AP government ) కీలక నిర్ణయం తీసుకుంది. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ కుమారుడు సురేష్ కుమార్ కు డిప్యూటీ తహసిల్దార్ ఉద్యోగం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో శివేరి సోమ హత్యకు గురయ్యారు. ఈ కేసును ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించింది. అయితే ఐదేళ్లపాటు ఈ ఫైల్ పెండింగ్లో ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో కదలిక వచ్చింది. ఫైల్ క్లియర్ చేస్తూ రెవిన్యూ శాఖ జోన్-1 లో ఈ నియామకం చేపట్టింది. 2018 సెప్టెంబర్ లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరూ చనిపోయారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది.
Also Read: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను చనిపోకుండా కాపాడిన రవితేజ…కారణం ఏంటంటే..?
* మావోయిస్టుల చేతిలో హతం..
అరకు ఎమ్మెల్యేగా 2014లో ఎన్నికయ్యారు కిడారి సర్వేశ్వరరావు( Kidari Sarveshwar Rao) . వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆయన టిడిపిలోకి ఫిరాయించారు. అయితే మన్యంలో గనుల తవ్వకాలను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హత్య చేశారు. తదనంతర పరిణామాలతో కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్ కు మంత్రి పదవి ఇచ్చారు. సివేరి సోమ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇంతలోనే రాష్ట్రంలో అధికారం మారింది. గత ఐదేళ్లపాటు ఆ ఫైల్ పక్కకు వెళ్లిపోయింది.
* కుటుంబం విజ్ఞప్తి మేరకు..
తాజాగా కూటమి అధికారంలోకి రావడంతో శివేరి సోమ( siveri Soma) కుటుంబం విజ్ఞప్తి మేరకు సురేష్ కుమార్ కు ఉద్యోగం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రెవెన్యూ శాఖ జోన్ 1 పరిధిలో డిప్యూటీ తహసిల్దార్ గా నియమించాలని ఆదేశాలు జారీచేసింది. అయితే ఘటన జరిగిన తరువాత సోమ చిన్న కుమారుడికి డిప్యూటీ కలెక్టర్ గా నియమించారు. పెద్ద కుమారుడుకు సరైన విద్యార్హత లేకపోవడంతో ఇవ్వలేకపోయారు. అటు తరువాత సురేష్ కుమార్ ఎంబీఏ పూర్తి చేశారు. అందుకే ఆయనను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో గ్రేడ్ 1 డిప్యూటీ తహసిల్దార్ గా నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.