CM Chandrababu Ambassador Car: ఎంతటి వారికైనా వ్యక్తిగత అభిరుచులు, ఇష్టాలు ఉంటాయి. అలానే ఏపీ సీఎం చంద్రబాబుకు( AP CM Chandrababu) సైతం అటువంటి ఇష్టాలే ఉన్నాయి. ఆయనకు తన పాత అంబాసిడర్ కారు అంటే చాలా ఇష్టం. దానిని లక్కీగా భావిస్తారు. 1978లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు చంద్రబాబు. మంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే ఒక అంబాసిడర్ కారును కొనుగోలు చేశారు. కొన్నేళ్లపాటు దానినే వినియోగించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన వాహన శ్రేణి మారింది. కానీ తనకు ఎంతో కలిసి వచ్చిన ఏపీ 09 జీ 393 నెంబర్ గల కారును అలాగే పదిల పరుచుకున్నారు. ప్రస్తుతం ఈ కారు హైదరాబాదులో ఉంది.
Also Read: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను చనిపోకుండా కాపాడిన రవితేజ…కారణం ఏంటంటే..?
* పార్టీ కార్యాలయానికి చంద్రబాబు..
నిన్ననే పార్టీ కార్యాలయంలో నాలుగు గంటలపాటు గడిపారు చంద్రబాబు. అమరావతిలోని( Amravati capital ) టిడిపి కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. ఆ సమయంలోనే హైదరాబాదు నుంచి తెప్పించిన పాత కారును పరిశీలించారు. ఇకనుంచి పార్టీ కార్యాలయంలోనే ఆ కారును ఉంచనన్నారు. ఆ కారుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ అంబాసిడర్ కారులోనే ఎక్కువగా పర్యటనలు చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే కార్ల పిచ్చి నందమూరి కుటుంబంతో పాటు నారా కుటుంబానికి ఉంది. నందమూరి హరికృష్ణ, ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, మంత్రి నారా లోకేష్ కు వాహనాలు అంటే చాలా ఇష్టం. అలా కొనుగోలు చేసిన వాహనాలను వారు చాలా ప్రేమగా చూసుకుంటారు. చంద్రబాబు సైతం అదే స్థాయిలో తన అంబాసిడర్ను జాగ్రత్తగా పదిలపరుచుకున్నారు.
* ఆ వాహనాలన్నీ..
నందమూరి తారక రామారావు( NT Rama Rao ) చైతన్య రథం ఇప్పటికీ ఉంది. ఈ చైతన్య రథం నందమూరి హరికృష్ణ నడిపేవారు. దానిపైనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు ఎన్టీఆర్. నందమూరి హరికృష్ణకు సైతం కార్ల పిచ్చి ఎక్కువ. మార్కెట్లోకి వచ్చే కొత్త కార్లను ఇట్టే కొనుగోలు చేసేవారు. నందమూరి హరికృష్ణ స్వయంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కార్లలో ప్రయాణించడం అంటే నందమూరి హరికృష్ణ కు చాలా ఇష్టం. అయితే తన తండ్రి చైతన్య రథాన్ని హరికృష్ణ ఎలా సంరక్షించుకున్నారో.. ఆయన కుమారులు సైతం తండ్రి గుర్తుగా ఆయన వాడిన వాహనాలను సంరక్షిస్తూ వచ్చారు.