Homeఆంధ్రప్రదేశ్‌YCP Former Ministers : ఆరుగురు మాజీ మంత్రులు జంప్.. ఢిల్లీ పెద్దల గ్రీన్ సిగ్నల్.....

YCP Former Ministers : ఆరుగురు మాజీ మంత్రులు జంప్.. ఢిల్లీ పెద్దల గ్రీన్ సిగ్నల్.. సంక్షోభం తప్పదా?

YCP Former Ministers :  వైసిపి తీవ్ర సంక్షోభంలో ఉంది. ఆ పార్టీలో ఎవరున్నారో? ఎవరు లేరో?.. అన్న పరిస్థితి వెంటాడుతోంది. పార్టీకి ఓటమి ఎదురుకాగానే చాలామంది నేతలు గుడ్ బై చెప్పారు. మరికొందరైతే రాజకీయాలనుంచి నిష్క్రమిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కొందరు పార్టీలో ఉన్న సైలెంట్ గా ఉన్నారు. మరికొందరు పార్టీలో ఉండడం కంటే బయటకు వెళ్లడమే మేలన్న నిర్ణయానికి వస్తున్నారు. పార్టీకి రాజీనామా చేస్తే ప్రభుత్వం టార్గెట్ చేయదని వారి భావన. అంతులేని విజయ గర్వంతోఎన్నికల బరిలో దిగిన వైసీపీకి చావు దెబ్బ తగిలింది.ఇక పార్టీకి భవిష్యత్తు లేదని మెజారిటీ నాయకులు భావిస్తున్నారు. అటువంటి వారంతా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. కూటమి పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరాలని చూస్తున్నారు. అవకాశం లేని వారు మాత్రం రాజకీయాలనుంచి తప్పుకుంటున్నారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని మొదటిసారిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. సినీ నటుడు అలీ అయితే తనకు రాజకీయాలతో సంబంధం లేదని తేల్చేశారు. నిన్నటికి నిన్న మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత సైతం రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చారు. గతంలో పంచాయతీ వార్డు సభ్యుడు నుంచి ముఖ్యమంత్రి వరకు.. 1000 ఏనుగుల బలంతో కనిపించింది వైసిపి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తాజాగా మరో ప్రచారం ఉంది. వైసీపీకి చెందిన తాజా మాజీ మంత్రులు ఆరుగురు ఒకేసారి పార్టీ నుంచి బయటకు వెళ్తారని ప్రచారం జోరందుకుంది. ఈ మేరకు వారు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది.

* ఆ పట్టుదలతో పవన్
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కూటమిలో విభేదాలతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరిగింది. కానీ తెర వెనుక మరో ప్రచారం ఉంది. ఇప్పటికీవైసిపి హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన నేతల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే పవన్ ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో వైసిపి హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన నేతలకు చుక్కలు చూపించాల్సిందేనని పవన్ పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే పవన్ ఆ వ్యాఖ్యలు చేశారని.. అందుకే ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో చర్చలు జరిపారని.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఏపీకి వచ్చి హోం శాఖ మంత్రి అనిత తో పాటు సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అతి త్వరలో వైసీపీ నేతలపై కేసుల నమోదు తో పాటు అరెస్టులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

* లోకేష్ రెడ్ బుక్ ప్రభావం
మరోవైపు లోకేష్ రెడ్ బుక్ థర్డ్ పేజీ తెరవ బోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పేజీలో వైసీపీలో బలమైన నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఐదేళ్ల పాటు టిడిపిని, జనసేన ను వెంటాడిన ఆరుగురు మాజీ మంత్రుల జాబితా ఉన్నట్లు సమాచారం. అక్రమాస్తులతోపాటు వీరిపై ఉన్న పాత కేసులను తిరగద్దోడి జైలుకు పంపించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రమాదాన్ని ముందే గ్రహించిన ఆ ఆరుగురు మాజీ మంత్రులు బిజెపిని ఆశ్రయించినట్లు సమాచారం. బిజెపి అగ్ర నేతలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఢిల్లీ వెళ్లి మూకుమ్మడిగా ఆ పార్టీలో చేరతారని తెలుస్తోంది. అదే జరిగితే వైసిపి మరింత సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular