Jagan (4)
Jagan: ఈమధ్య కాలం లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తున్నాయి. అసెంబ్లీ లో కచ్చితంగా ప్రతిపక్షంకి ఉనికి ఉండాలి. లేకపోతే ప్రజా సమస్యలు చర్చకు రావు. ఎంతసేపు ప్రభుత్వానికి ఏకపక్ష భజన లాగా మారిపోతుంది. ఒకవేళ ప్రతిపక్షమే ఉంటే ప్రభుత్వం లోని లోటుపాట్లను తెలియచేసే అవకాశం ఉంటుంది. వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. 2019 ఎన్నికలలో టీడీపీ కి జనాలు ప్రతిపక్ష హోదాని కల్పించారు కానీ, 2024 సార్వత్రిక ఎన్నికలలో మాత్రం వైసీపీ పార్టీ కి కనీసం ప్రతిపక్ష హోదాని కూడా కల్పించలేదు జనాలు. మాజీ సీఎం జగన్(YS Jagan) నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ కి వస్తాను అంటూ భీష్మించి కూర్చున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగ బద్దంగా అది కుదరదు అని ప్రభుత్వం పదే పదే చెప్తున్నా జగన్ వినిపించుకోవడం లేదు. అసెంబ్లీ మొదటి సెషన్ లో కేవలం ఒక్కరోజు పాల్గొన్న జగన్, మళ్ళీ ఇన్ని రోజులు అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
దీంతో అసెంబ్లీ(Assembly Sessions) స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Speaker Ayyannapatrudu), డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణంరాజు(Raghurama Krishnamraju|) జగన్ కి హెచ్చరికలు జారీ చేస్తూ ‘వరుసగా 60 రోజులు అసెంబ్లీ కి రాకపోతే, మీ సభ్యత్వం, మీ పార్టీ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తాం. మళ్ళీ ఉప ఎన్నికలకు సిద్ధం అవ్వండి’ అంటూ చెప్పుకొచ్చారు. మొదట్లో పెద్దగా పట్టించుకోని జగన్, పార్టీ ముఖ్య సలహాదారులు ఇచ్చిన సూచన మేరకు 24 నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాసేపటి క్రితమే ఆయన తన ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి 24 న అసెంబ్లీ సెషన్స్ కి హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసాడట. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే అసెంబ్లీ లోకి అడుగుపెడుతానని చెప్పిన జగన్ ఇప్పుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు?.
అనర్హత వేటు వేస్తారనే భయం కారణంగానే ఆయన అసెంబ్లీ కి వస్తున్నాడా?, మళ్ళీ ఉప ఎన్నికలు పెడితే ఉన్న 11 సీట్లు కూడా పోతాయనే భయం ఆయనలో నెలకొండా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అందుతున్న సమాచారం ఏమిటంటే, 24 న ప్రారంభమయ్యే అసెంబ్లీ సెషన్ లో కేవలం గవర్నర్ ప్రసంగాన్ని విని, రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్ళిపోతారని తెలుస్తుంది. అంటే అసెంబ్లీ సెషన్స్ లో జగన్ పూర్తి స్థాయిలో పాల్గొనలేదన్నమాట. కేవలం ఆయన తన సభ్యత్వం రద్దు కాకుండా ఉండేందుకు కోసమే సంతకం పెట్టేందుకు వస్తున్నాడు అన్నమాట. ఇదే వైఖరి ని జగన్ కొనసాగిస్తూ పోతే, రాబోయే రోజుల్లో ఆయనకి ఒక్క సీట్ రావడం కూడా కష్టమే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. జగన్ లో అహం భావం ఇంకా అసలు తగ్గలేదని, ఆ మోతాదు బాగా పెరిగిందని అంటున్నారు.