YS Jagan : గత ఐదేళ్లుగా జగన్ ప్రత్యేక విమానాల్లోనే రాకపోకలు సాగించేవారు.చివరకు అమరావతి నుంచి విజయవాడ నగరానికి రావాలన్నా హెలిక్యాప్టర్ వినియోగించేవారు. అటు గుంటూరు వెళ్లాలన్న గాలిలోనే. నాలుగైదు కిలోమీటర్ల దూరాన్ని సైతం నేలపై వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడేవారు కాదు. గాలిలోనే చక్కర్లు కొట్టేవారు. అటువంటిది అధికారానికి దూరమయ్యేసరికి సామాన్య విమాన ప్రయాణికుడిగా మారిపోయారు జగన్. ఓడిపోయిన తర్వాత తరచూ బెంగళూరు వెళుతున్న సంగతి తెలిసిందే.వారంలో రెండు మూడు రోజులపాటు తాడేపల్లి లో ఉంటున్నారు. ప్యాలెస్ లో పార్టీ రివ్యూలు జరుపుకున్నారు. అటు తరువాత బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలో సామాన్య ప్రయాణికుడు మాదిరిగా విమాన రాకపోకలు సాగిస్తుండడం విశేషం. తాజాగా ఇండిగో విమానంలో జగన్, భారతి దంపతులు సామాన్య ప్రయాణికులతో కలిసి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదానీ ముడుపుల వ్యవహారంలో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. అందుకే ప్రత్యేక విమానాలను పక్కనపెట్టి.. సామాన్య ప్రయాణికులతో పార్టీ విమాన ప్రయాణం చేస్తున్నారని సెటైర్లు పడుతున్నాయి.
* గొప్పగా ఫీల్ అవుతున్న వైసిపి
అయితే వైసీపీ సానుభూతిపరులు మాత్రం దీనిని మరోలా చిత్రీకరిస్తున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేత ఇలా సింపుల్ గా.. అందరితో కలిసి ప్రయాణించడం ఆసక్తికరంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ప్రత్యేక విమానాల్లో ప్రయాణించే సీఎం.. ఇలా అందరితో కలిసి ప్రయాణించడానికి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ ఏపీలో ఉండేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. ఎక్కువగా బెంగళూరులోనే గడుపుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి బెంగళూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే గతం మాదిరిగా ప్రత్యేక విమానం, హెలికాప్టర్ ను వాడడం లేదు. సామాన్య విమాన ప్రయాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
* సోషల్ మీడియాలో హైలెట్
అదాని అవినీతి వ్యవహారం అమెరికాలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి 1750 కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారని జగన్ పై ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై జగన్ కార్నర్ చేస్తోంది కూటమి ప్రభుత్వం.ఈ తరుణంలోనే జగన్ విమాన ప్రయాణాలను, సింపుల్ సిటీని వైసిపి ప్రచారం చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదాని ప్రస్తావన లేకుండా జగన్ చుట్టూ కూటమి సర్కార్ ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికైతే ఏపీలో ఎటువంటి ఎన్నికలు లేనప్పటికీ.. నేతలకు సంబంధించి ప్రతి అంశం ప్రాధాన్యతగా మారుతోంది.నేతలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం హైలెట్ అవుతోంది.
ఎసుంటెసుంటి ఇమానాల్లో తిరిగే జంట.
మందిసొమ్ముతో ప్రత్యేక ఇమానాల్లో తిరిగే జంట 1750 కోట్ల లంచం దెబ్బకి ఏ ఇమానం దొరికితే ఆ ఇమానంలో బెంగుళూరు మింగేయడం మంచిదనే సలహా ఇచ్చిన సలహాల రెడ్డి సలహా పాటించి ఇలా ఇండిగో ఇమానంలొ ఎగరడమైనది pic.twitter.com/Nt4LRqM2D3— VamsiKrishna Bandaru (@VKBandaru18) November 23, 2024
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Former cm jagan and his wife on a flight with ordinary passengers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com