Jagan Security Lapse: అధికార కూటమి, ప్రతిపక్ష వైసిపి మధ్య ఉప్పు నిప్పులాగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. పోటా పోటీగా ప్రదర్శనలు.. పోటాపోటీగా విమర్శలు.. పోటాపోటీగా ఆరోపణలతో అక్కడి రాజకీయాలు అత్యంత రసకందాయంలో సాగుతున్నాయి.. ఈ క్రమంలో ఇటీవల వైసిపి అధినేత చేపట్టిన పర్యటనలో వివాదాలు చోటుచేసుకున్నాయి.. ఇద్దరు కన్ను మూయడంతో ఆరోపణలు చెలరేగుతున్నాయి. ఇది భద్రతా లోపమని వైసిపి అంటుంటే.. ముమ్మాటికి జగన్ పర్యటన లో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహానికి పాల్పడటం వల్ల ఇలాంటి దారుణం చోటుచేసుకుందని కూటమి నేతలు అంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. ఇది ఇలా ఉండగానే వైసిపి సంచలన వీడియో ఒకటి విడుదల చేసింది.
Also Read: కడియం శ్రీహరి అనుచరులు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారా? రెవెన్యూ అధికారుల చర్యలతో కలకలం!
ఏపీలోని తాడేపల్లి ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకు ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరి స్థాయిలో భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. హైకోర్టు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం పైస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇటీవల కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి వైఎస్ జగన్ నివాసం వద్ద తాటికాయలు విసిరేసి వెళ్లిపోయారని ఆరోపిస్తున్నారు. తాము చేసిన వ్యాఖ్యలు ఆరోపణలు కాదని.. అవి నిజాలని సిసి ఫుటేజ్ లో నమోదైన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు .. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. సీసీ ఫుటేజ్ అందించినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నప్పుడు రోప్ పార్టీ కనిపించడం లేదని.. రోడ్డు క్లియరెన్స్ పార్టీ కూడా కనిపించడం లేదని.. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ప్రభుత్వం కావాలని ఇలా చేస్తోందని.. భద్రతను పట్టించుకోవడంలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ” మాజీ ముఖ్యమంత్రి కి భద్రత లేదు. గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి తాటికాయలు విసిరేసి వెళ్లిపోయారు. ఆ తాటికాయల స్థానంలో మరొకటి ఉంటే పరిస్థితులు ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోంది. కనీసం భద్రత కల్పించే విషయంలోనూ పటిష్ట చర్యలు తీసుకోలేకపోతోంది. ఇది సరైన విధానం కాదని” వైసిపి నాయకులు అంటున్నారు.
వైసీపీ అనుకూల సోషల్ మీడియా విభాగంలో జగన్మోహన్ రెడ్డి గృహంలో విసిరేసిన తాటికాయల దృశ్యాలకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి భద్రతపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని.. ఇప్పటికైనా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు కోరుతున్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని వైసిపి నాయకులు హెచ్చరిస్తున్నారు.
మాజీ సీఎం @ysjagan ఇంటి వద్ద భద్రత లోపం!
నిన్న సాయంత్రం తాడేపల్లి జగన్ ఇంటి దగ్గరకి కారులో వచ్చి తాటికాయ విసిరేసిన దుండగులు.
హై కోర్టు హెచ్చరించిన #ysjagan కు z+ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వడం లేదు అంటున్న వైసీపీ
ఈ కూటమి ప్రభుత్వం జగన్ పర్యటనకు.. ఇంటి దగ్గర సెక్యూరిటీ ఇవ్వడంలో విఫలం… pic.twitter.com/xzcmwVdGTU
— greatandhra (@greatandhranews) June 22, 2025