Kiran Kumar Reddy: చంద్రబాబును కలిసిన కిరణ్ కుమార్ రెడ్డి.. టార్గెట్ ఫిక్స్!

ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా వ్యవహరించారు కిరణ్ కుమార్ రెడ్డి. వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో రోశయ్యకు ఆ పదవి ఇచ్చారు. కానీ రోశయ్య ఆశించిన స్థాయిలో ప్రభుత్వాన్ని నడిపించలేకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం బాధ్యతలు అప్పగించింది నాటి కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకం కావడంతో.. కిరణ్ కూడా రాజకీయాల నుంచి కొద్దిరోజులు నిష్క్రమించారు.

Written By: Dharma, Updated On : October 7, 2024 1:12 pm

Kiran Kumar Reddy-Chandrababu

Follow us on

Kiran Kumar Reddy : వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డిని తొక్కేయాలని చంద్రబాబు భావిస్తున్నారా?పొలిటికల్ గా దెబ్బ తీయాలని గట్టి ఆలోచన చేస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లో పుంగనూరులో ఆ కుటుంబం గెలవకూడదని నిర్ణయానికి వచ్చారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా పెద్దిరెడ్డి కి చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఆదివారం హైదరాబాదులో చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి గంట పాటు సమావేశమయ్యారు.చాలా లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. పెద్దిరెడ్డి హవా గత ఐదేళ్లుగా నడిచింది.పెద్దిరెడ్డి తీరుతో ఇటు చంద్రబాబు,అటు కిరణ్ కుమార్ రెడ్డి కూడా అసౌకర్యానికి గురయ్యారు.చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. ఆ ఇద్దరు నేతల రాజకీయ ఉనికిని ప్రశ్నార్ధకం చేయడానికి పెద్దిరెడ్డి ప్రయత్నించారు.అందుకే ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు వ్యూహాత్మకంగా చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యేగా కిరణ్ సోదరుడు ఉన్నారు.ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు.ఓటమి అంచుకు తీసుకువచ్చారు.అటు పుంగనూరులో సైతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వల్ప ఓట్లతో గట్టెక్కగలిగారు.అయితే వచ్చే ఎన్నికల నాటికి పెద్దిరెడ్డి పేరు వినిపించకుండా చేయాలని చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

* టిడిపిలోకి వెళ్తారా?
అయితే తాజాగా కిరణ్ చర్యలు చూస్తుంటే టిడిపి వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తల్లో అంతగా పాల్గొనడం లేదు కిరణ్.అదే సమయంలో టిడిపి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.చంద్రబాబు పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టిడిపికి చేరువ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ తరుణంలోనే ఆయన చంద్రబాబుతో భేటీ కావడం ఈ అనుమానాలకు బలం పెంచుతోంది. బిజెపి రాష్ట్ర పగ్గాలు కిరణ్ కు అప్పగిస్తారని ప్రచారం సాగింది. తెలంగాణతో పాటు ఏపీ అధ్యక్ష పదవులను ప్రకటిస్తారని.. ఈ మేరకు కిరణ్ పేరు ఖరారు చేసినట్లు తెగ ప్రచారం నడిచింది.

* ఆ రెండు పదవుల కోసమేనా
అయితే ఇప్పుడు బిజెపి నుంచి టిడిపిలో చేరితే.. తరచూ పార్టీలు మారుతారన్న అపవాదు ఆయనపై ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే సోదరుడుటిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు.చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఆయనకు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ఇప్పుడు కిరణ్ చంద్రబాబుని ఎందుకు కలిశారా? అన్నది ప్రశ్న. ప్రతిష్టాత్మకమైన టిటిడి చైర్మన్ పదవి కోసమని కూడా ప్రచారం సాగుతోంది. మరోవైపు రాజ్యసభ పదవి అడిగినట్లు కూడా టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వాలంటే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. అందుకే చంద్రబాబును కలిసి తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.