Manyam District: వారంతా కార్మికులు ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లాలో వంశధార ప్రాజెక్టు పనుల నిమిత్తం వచ్చారు. రోజూ పనులు చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. స్నానాలకు ప్రాజెక్టు వద్దకు వెళ్తున్నారు. ఆదివారం రోజూలాగానే స్నానం చేసేందుకు నది వద్దకు వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇంతకీ వాళ్లకు ఏం కనిపించింది. ఎందుకు షాక్ అయ్యారు అనే వివరాలు తెలుసుకుందాం.
పురాతన విగ్రహాలు..
పార్వతీపురం మన్యం జిల్లాలో కొన్ని రోజులుగా వంశధార ప్రాజెక్టు పనులు జరుగుతున్నారు. ఈ పనులు చేస్తున్న కూలీలు ప్రాజెక్టు వద్దనే ఉంటున్నారు. నదిలో నిత్యం స్నానాలు చేస్తున్నారు. ఆదివారం కూడా కూలీలు స్నానాలకు నది వద్దకు వెళ్లారు. వేసవి కావడంతో నదిలో నీటిమట్టం తగ్గింది. దీంతో కార్మికులకు అరుదైన పురాతన విగ్రహాలు కనిపించాయి. నదిలోని నేరడి బ్యారేజీ దగ్గర పురాతన ఐదు దేవతా విగ్రహాలు, నంది, ఇతర శిలలను గుర్తించారు కార్మికులు. వెంటనే వాటిని ఒడ్డుకు తెచ్చారు.
పూజలు చేసిన భక్తులు..
ఈ వార్త క్షణాల్లో దావానంలా వ్యాపించింది. దీంతో చుట్టుపక్క గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. కొందరు దేవతల విగ్రహాలు కొబ్బరి కాయలు కొట్టి.. పూజలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా విగ్రహాలను పరిశీలిస్తే గతంలో పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన ఆలయాల్లో తొలగించిన విగ్రహాలను తిరిగి ప్రతిష్టించే అవకాశం లేకపోవడంతో ఇలా జలాధివాసం చేసి ఉంటారని భావిస్తున్నారు.
గుప్త నిధుల దొంగల పనా?
ఇదిలా ఉండగా తీర ప్రాంతాల్లో పురాతన ఆలయాల్లో గుప్త నిధుల తవ్వకాలు జరుగుతునా‍్నయి. ఇలా దొంగలు ఆలయాల్లో తొలగించిన విగ్రహాలను తీసుకొచ్చి నదిలే పడేసి ఉంటారని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు చేరుకుని పురావస్తు శాస్త్రవేత్తలను రపి‍్పంచారు. వారు విగ్రహాలను పరిశీలించి ఏ కాలం నాటివో గుర్తించే పనిలో ఉన్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Five ancient deity idols were found in vamsadhara river in parvathipuram manyam district
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com