ABN RK – Chevireddy : జగన్ తో వైరం.. చెవిరెడ్డితో చెలిమి.. ఏబీఎన్ ఆర్కేను భాస్కర్ రెడ్డి ఎలా మేనేజ్ చేస్తున్నాడు

అమ్ముడుపోయే పత్రికగా ఆంధ్రజ్యోతి, కొనుగోలు చేసే మనిషిగా చెవిరెడ్డి లాంటి వారు ఉన్నంత కాలం ప్రజాస్వామ్య విలువలు, తొక్కా, తోటకూర అనకూడదు. అలా అన్నామంటే ముందు మనం సశ్చీలత చూపించుకోవాలి. 

Written By: Dharma, Updated On : July 19, 2023 2:36 pm
Follow us on

ABN RK – Chevireddy : ఏపీలో ఎల్లో మీడియా తీరే వేరు. ఒళ్లంతా పసుపు ఎక్కించుకున్నట్టు వారి వార్తలు ఉంటాయి. సమాజంలో మా లాంటి నీతిమంతులు లేరు అన్నట్టుంది ఈ సెక్షన్ ఆఫ్ మీడియాది. ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ రాతలు, మాటలు రోత పుట్టించేలా ఉంటాయి. వైసీపీతో పాటు జగన్ విషయంలో రాధాక్రిష్ణ వాడే భాష కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. పచ్చి పచ్చి రాతలతో పసుపు శ్రేణులకు బలమైన టానిక్ లా పనిచేస్తోంది. ఇదో నిఘంటువుగా భావించే పచ్చ శ్రేణులు ఆర్కే రాతలతోనే ముందుకెళతారు.అంతెందుకు ఆర్కే ఇలా రాస్తాడో లేదో తండ్రీ, కొడుకులు చంద్రబాబు, లోకేష్ రెచ్చిపోతారు. కానీ నిప్పులాంటి ఆర్కేను సైతం ఇట్టే కొనుగోలు చేయవచ్చని నిరూపించాడు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.

రాష్ట్రంలో 174 నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేక వార్తలు వచ్చినా.. చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డిని మాత్రం ఆంధ్రజ్యోతి టచ్ చెయ్యదు. అయితే ఆర్కే భాస్కరరెడ్డికి అమ్ముడుపోయాడో.. లేక ఆర్కేను భాస్కరరెడ్డికి ఎంత ధరకు కొనుగోలు చేశాడో తెలియదు కానీ ..చంద్రగిరిలో మాత్రం మా అస్త్రం మీ ఆయుధం పనిచేయదు. తనకు జగన్ సర్కారు ప్రకటనలు ఇవ్వకున్నా నిజాయితీగా పేపరు నడుపుకుంటున్నానని చెబుతున్న ఆర్కే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విషయంలో ఆ వెసులబాటుకు కారణమేంటో చెప్పాలి. అయితే గత నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. అయితే దీని వెనుక ‘ప్రకటనల’ మర్మం ఉన్నట్టు తెలుస్తోంది. చెవిరెడ్డి భాస్కరరెడ్డి నిలువెత్తు ఫొటోలతో వచ్చే ఫుల్ పేజీ యాడ్లే కారణం.

రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల్లోకి ప్రజాప్రతినిధులు వెళుతుండడం.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడంతో ప్రజలు నిలదీయడం కామన్. అయితే దానినే ఎల్లో మీడియా పతాక శీర్షికన వండి వార్చుతుంది. అందులో నో డౌట్. చివరకు ఎంత పెద్ద నాయకుడికైనా మినహాయింపు లేదు. అయితే ఈ విషయంలో చంద్రగిరి చెవిరెడ్డి వారసులకు మినహాయింపు లభించింది. నియోజకవర్గంలో ఓ గ్రామానికి వెళ్లిన భాస్కరరెడ్డి తనయుడు మోహిత్ రెడ్డిని గ్రామసమస్యల విషయంలో గ్రామస్థులు చుట్టుముట్టారు. కానీ పక్కన ఉండే మరో ఎల్లో మీడియాలో పతాక శీర్షికన వార్త వచ్చింది. కానీ ఆర్కే పత్రికలో మాత్రం ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. అయితే దీనిని అమ్ముడుపోవడం అంటారా? లేకుంటే యాడ్ల రూపంలో వ్యాపారం చేయడం అంటారా? ఆర్కేకే తెలియాలి.

గురివింద సామెత చందంలా దొంగే దొంగ అన్నట్టుంది వ్యవహారం. చెవిరెడ్డి జగన్ కు సన్నిహితుడు. ఆర్కే చంద్రబాబుకు సొంత మనిషి. జగన్ కు చంద్రబాబుకు మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. వారికి నమ్మిన బంటులుగా ఉన్నవారు ఎంత నమ్మకం ఉండాలి. ఉంటున్నారా? అంటే అదీ లేదు. అమ్ముడుపోయే పత్రికగా ఆంధ్రజ్యోతి, కొనుగోలు చేసే మనిషిగా చెవిరెడ్డి లాంటి వారు ఉన్నంత కాలం ప్రజాస్వామ్య విలువలు, తొక్కా, తోటకూర అనకూడదు. అలా అన్నామంటే ముందు మనం సశ్చీలత చూపించుకోవాలి.