Deputy Cm Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రతీరోజు ఎంత బిజీగా ఉంటున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. రోజు ఎదో ఒక సమీక్ష సమావేశం చేస్తూ, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, షూటింగ్స్ ని కూడా పక్కన పెట్టి ఆయన పాలనలో నిమగ్నమయ్యాడు. ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు అనేది పవన్ కళ్యాణ్ పాలసీ. అయితే రిపబ్లిక్ డే తర్వాత పవన్ కళ్యాణ్ కనిపించకుండా పోయాడు. రిపబ్లిక్ డే నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు తో కలిసి జెండా ఆవిష్కరణ చేసి, ఆ తర్వాత గవర్నర్ ఏర్పాటు చేసిన విందుకి కూడా హాజరయ్యాడు. ఆ పక్క రోజు నుండి పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి చప్పుడు లేదు. త్వరలో ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. రేపటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వ్యాప్తంగా పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించి, రోడ్ షోస్ కూడా చేయబోతున్నాడు.
పవన్ కళ్యాణ్ ని కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారం లో పాల్గొనాలని ఢిల్లీ హై కమాండ్ కోరింది. కానీ పవన్ కళ్యాణ్ జాడ మాత్రం లేదు. ఆయన ఢిల్లీ ఎన్నికల ప్రచారం లో పాల్గొంటాడా లేదా అనే దానిపై కూడా పార్టీ నుండి ఎలాంటి సమాచారం లేదు. ఇంతకు ఎందుకు ఇంత సైలెన్స్?, అసలు పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు ?, రహస్యంగా సినిమా షూటింగ్స్ చేసుకుంటున్నాడా?, లేకపోతే కొంతకాలం మౌనంగా ఉండాలని అజ్ఞాతం లో ఉండిపోయాడా అని అభిమానులు ఆరా తీయగా తెలిసింది ఏమిటంటే, ఆయన తన భార్య పిల్లలను కలవడానికి స్విజర్ల్యాండ్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. ఎన్నికలలో గెలిచిన రెండు నెలల తర్వాత ఆయన తన భార్య కోసం స్విజర్ ల్యాండ్ కి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు రెండవసారి వెళ్ళాడు. అక్కడ ఆమె పై చదువులు చదువుకుంటున్న సంగతి తెలిసిందే. డిగ్రీ పట్టా కూడా పొందింది. దానికి సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ స్విజర్ ల్యాండ్ నుండి నేరుగా ఢిల్లీ కి చేరుకుంటాడని, అక్కడ రెండు రోజుల పాటు ఆయన వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్ షోస్ నిర్వహిస్తాడని తెలుస్తుంది. ఫిబ్రవరి 2వ తారీఖున ఈ ప్రోగ్రామ్స్ ఉండబోతున్నట్టు సమాచారం. మహారాష్ట్ర ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఏ రేంజ్ రేంజ్ లో పని చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దశాబ్దాల నుండి గెలవని సీట్లు కూడా కూటమికి దక్కేలా చేసింది పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం. ఢిల్లీ కూడా ఆయన మ్యాజిక్ వర్కౌట్ అవుతుందని బలమైన నమ్మకం తో ఉంది బీజేపీ హై కమాండ్. ఢిల్లీ లో మన తెలుగువాళ్ళు దాదాపుగా పది లక్షల మంది ఉన్నారట. వీళ్ళ ఓట్లు అత్యంత కీలకం. తెలుగు నివసించే ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండేలా బీజేపీ పెద్దలు ప్లాన్ చేశారట. చూడాలి మరి పవన్ కళ్యాణ్ మ్యాజిక్ ఢిల్లీ ఎన్నికలలో ఎంత వరకు పని చేస్తుంది అనేది.