Fake Liquor: ఏపీలో( Andhra Pradesh) నకిలీ మద్యం ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కల్తీ మద్యం వెలుగులోకి రావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రంగా మార్చుకుంటుంది. అయితే వైసిపి మూలాలతోనే ఈ నకిలీ మద్యం దందా జరుగుతోందని టిడిపి కూటమి ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా తంబళ్లపల్లె నియోజకవర్గం లో నకిలీ మద్యం వెలుగులోకి రావడం.. అందులో సంబంధం ఉందని తేలడంతో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి తో పాటు మరో నేతపై సస్పెన్షన్ వేటు వేసింది తెలుగుదేశం. ఇంకోవైపు ఈ కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు అరెస్టయ్యారు. అయితే పక్కా వ్యూహంతోనే రాజకీయ ముసుగు ధరించి ఈ నకిలీ మద్యం దందాకు పాల్పడినట్లు స్పష్టమౌతోంది. ప్రధాన నిందితుడు అదుపులోకి రావడంతో ఈ కేసులో కీలక మలుపులు పెరగబోతున్నట్లు తెలుస్తోంది.
* ప్రధాన నిందితుడి అరెస్ట్..
ఆఫ్రికా( Africa) వెళ్లిన ప్రధాన ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అద్దేపల్లి జనార్దన్ రావు గన్నవరం ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ అయ్యారు. అయితే ఈ నకిలీ మద్యం మూలాలు ఆఫ్రికాలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ప్రారంభించిన కుటీర పరిశ్రమగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అద్దేపల్లి శ్రీనివాసరావుకు ఎలాంటి అనారోగ్యం లేదని తెలుస్తోంది. వైద్యం కోసం ఆయన దక్షిణాఫ్రికా ఆసుపత్రికి వెళ్లినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేనట్టు సమాచారం. ఆయన కల్తీ లిక్కర్ వ్యాపారం గురించి ఆఫ్రికా వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
* రెడ్డీస్ గ్లోబల్ పేరుతో..
ఆఫ్రికా దేశాల్లో రెడ్డీస్ గ్లోబల్( reddish global ) పేరుతో మద్యాన్ని విక్రయించే కంపెనీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ పెద్ద పెద్ద డిస్టర్లరీలు ఏర్పాటు చేయలేదు. కుటీర పరిశ్రమగా ఇళ్లల్లో చీప్ లిక్కర్ తయారుచేసి అమ్మేవారట. కొద్దిగా యంత్ర సామాగ్రి, చిన్నచిన్న డ్రమ్ములతో చీప్ లిక్కర్ తయారు చేసేవారట. అయితే అధికారుల దాడుల్లో ఈ కుటీర కల్తి మద్యం పరిశ్రమలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో ములకల చెరువులో అదే తరహా దందా బయటపడటం.. ఏ 1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లడం.. ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం ఉండేలా కనిపిస్తున్నాయి. అయితే తంబళ్లపల్లెలో ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు. తన సొంత నియోజకవర్గంలో ఓ టిడిపి నేతప్రమేయంతో ఇంత దందా జరుగుతున్నా.. బయట పెట్టకపోవడంతోనే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
* అక్కడ మద్య నిషేధం
వాస్తవానికి ఆఫ్రికాలో మద్యం వ్యాపారాన్ని నిషేధించారు. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని అక్కడి ప్రభుత్వాలు కూడా నిషేధం విధించాయి. దీంతో అక్కడ పరికరాలతో పాటు సామాగ్రిని తీసుకొచ్చి నకిలీ మద్యం చలామణి చేశారన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి దొరకడం.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే దానిని బయట పెట్టకపోవడం వంటివి అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి. అక్రమ వ్యాపారాలకు అలవాటు పడి.. అధికార పార్టీలోకి తన మనుషులను పంపించి ఈ దందా కొనసాగించినట్లు స్పష్టమవుతోంది. మొత్తానికైతే ఆఫ్రికాలో నకిలీ మద్యం మూలాలు ఏపీలో వెలుగు చూడడం మాత్రం సంచలనంగా మారింది.