Janasena Plenary
Janasena Plenary: జనసేన( janasena ) ప్లీనరీకి సర్వం సిద్ధం అయింది. ఇప్పటికే కార్యక్రమాన్ని జయకేతనంగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఆవిర్భావ సభ ఇది. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామం వద్ద 50 ఎకరాల ప్రాంగణంలో జయకేతనం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు జనసేన అనేది ఒక ప్రాంతీయ పార్టీ. కానీ ఎన్నికల ఫలితాల తరువాత ఆ పార్టీ పేరు మార్మోగిపోయింది. 100% విజయంతో జనసేన సూపర్ విక్టరీ సాధించింది. జాతీయస్థాయి అంశాలతో పవన్ కళ్యాణ్ సైతం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. భారతీయ జనతా పార్టీకి అత్యంత స్నేహితుడిగా మారారు. మంచి చరిష్మ కలిగిన నేతగా గుర్తింపు పొందారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో పవన్ ప్రసంగానికి అక్కడి ప్రజలు ఫిదా అయ్యారు. అందుకే జనసేన ఆవిర్భావ సభకు భారీగా జనాలు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.
Also Read: ఆ దోపిడీదారుడు జగన్ సోదరుడు.. 30 ఇయర్స్ పృథ్వీ సంచలన ట్వీట్!
* గత కొద్ది రోజులుగా ఏర్పాట్లు
జనసేన ప్లీనరీకి( janasena pleanery) సంబంధించి గత కొద్ది రోజులుగా ఆ పార్టీ శ్రేణులు గట్టిగానే కష్టపడుతున్నాయి. ముందుగానే జనసేన నాయకత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రత్యేక కమిటీలను పరివేక్షిస్తున్నారు. సుమారు 250 మంది కూర్చునేలా వేదికను ఏర్పాటు చేశారు. ప్రత్యేక గ్యాలరీల్లో కుర్చీలు, ఎల్ఈడి తెరలు, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. నేతల వాహనాల పార్కింగ్ స్థలాలను ఆరు చోట్ల ఏర్పాటు చేశారు.
* నాలుగు చోట్ల భోజన కౌంటర్లు
కార్యక్రమానికి హాజరయ్యే వారి కోసం భోజన వసతి ఏర్పాట్లు కూడా చేశారు. ఇందుకుగాను నాలుగు చోట్ల కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. జనసేన డాక్టర్ వింగ్( janasena Dr wing ) ఆధ్వర్యంలో 7 చోట్ల వైద్య శిబిరాలు, 12 చోట్ల అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచారు. సుమారు 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 70 సీసీ కెమెరాలతో పాటు 15 డ్రోన్ల నిఘా ఉంది. 500 మంది జనసేన వాలంటీర్లు, అందులోనే వందమంది మహిళా వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు.
* సాయంత్రం నాలుగు గంటలకు పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan) సాయంత్రం నాలుగు గంటలకు ఆ ప్రాంగణానికి చేరుకుంటారు. రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుంది. పవన్ ప్రసంగం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కూటమి కొనసాగడం, అందులో జనసేన పాత్ర పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు పవన్ కళ్యాణ్. దీంతో అందరి దృష్టి పవన్ ప్రసంగంపై ఉంది. పార్టీ బలోపేతంపై నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు ఊహించని విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే పిఠాపురానికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు చేరుకుంటున్నారు.
Also Read: ఇప్పట్లో పోసాని బయటపడతారా? ఆర్జీవి భయం అదే!