Chandrababu : చంద్రబాబుకు ఈనాడు షాక్

మరి చంద్రబాబు విషయంలో మాత్రం అలా చెప్పడం లేదు. అంటే జనాలు రావట్లేదనా? లేకుంటే వాహనాలు పెట్టడం లేదనా? ఏదో ఒక విషయం చెప్పాలి కదా? కానీ జగన్ కు వ్యతిరేకంగా ఏదైనా చెప్పాలన్న ప్రయత్నంలో ఈనాడు అడ్డంగా బుక్ అవుతోంది. చంద్రబాబుకు నష్టం చేకూరుస్తోంది. ఈ విషయంలో ఈనాడు పునరాలోచించకపోతే తెలుగుదేశం పార్టీకి మరింత నష్టం తప్పదు.

Written By: NARESH, Updated On : April 1, 2024 3:54 pm
Follow us on

Chandrababu : టిడిపి విషయంలో ఎల్లో మీడియా ఆలోచన ఏమిటో తెలియడం లేదు. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి అసలు మేలు చేస్తున్నారా? కీడు చేస్తున్నారా? అన్నది తెలియడం లేదు. చంద్రబాబుకు భజన చేసే క్రమంలో జగన్ పై విషప్రచారానికి దిగుతున్నారు. అయితే ఇది అటు తిరిగి ఇటు తిరిగి టిడిపికి మైనస్ చేసేలా ఉంది. నైతిక విలువల పరంగాఈనాడు అనేక మెట్లు దిగజారిపోయింది. పాతాళానికి చేరుకుంది. చంద్రబాబుకు ప్రయోజనం చేకూరుస్తున్నామన్న భావనతో అబద్ధపు, అర్థసత్య ప్రచారాలకు దిగుతోంది.సాక్షి ఒక పార్టీ పత్రిక అన్న సంగతి మరిచి.. అంతకుమించి టిడిపి కరపత్రికలా మార్చేశారు రామోజీరావు.

వైసీపీ సర్కార్ తో పాటు జగన్ తీరుపై ఈనాడులో వ్యతిరేక కథనాలు వస్తున్నాయి. ఆయనకు ప్రజలు దూరమయ్యారని.. ఆయన వస్తే ముఖం చాటేస్తున్నారని ఒకసారి చెబుతున్నారు. మరోసారి మాత్రం జనాలను తరలించేందుకు వేలాది వాహనాలను వినియోగిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. అయితే జనాలు బెంబేలెత్తడం అయినా ఖాయం కావాలి.. లేకుంటే వేలాది బస్సుల్లో లక్షలాదిమంది వెళ్లడం అయినా జరిగి ఉండాలి. మదనపల్లె సిద్ధం సభకు 1056 బస్సులు ఏర్పాటు చేశారని ఈనాడులో రాసుకొచ్చారు. అటువైపు వెళ్లాల్సిన వారు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సైతం సూచిస్తూ ఒక ప్రత్యేక కథనం రాసుకొచ్చారు. అయితే ఈ కథనం చూస్తే లక్షలాదిమంది జనాలు తరలి వస్తారని ఎవరైనా అంచనాకు వస్తారు. కానీ ఆ మరుసటి రోజే 30 వేలకు మించి ఆ ప్రాంగణంలో జనాలు పట్టరని ఇదే ఈనాడు ఒక కథనం ప్రచురిస్తోంది.

చంద్రబాబుకు జన నీరాజనం పడుతున్నారని చెప్పడంలో తప్పులేదు. కానీ జగన్ విషయంలో విషం చిమ్మడం.. జగన్ కార్యక్రమాల్లో తప్పులు వెతకడం మాత్రం ముమ్మాటికి ఈనాడుకు తగదు. సాక్షి అనేది వైసిపి అధికారిక పత్రిక. ఆ పార్టీ గురించి మాత్రమే పనిచేస్తుంది. ఆ పార్టీని అధికారంలోకి తేవడానికి శ్రమిస్తోంది. దానిని తప్పు పట్టలేం. తప్పు పట్టినా దానిని సరిదిద్దుకునే పరిస్థితుల్లో సాక్షి లేదు. కానీ ఈనాడు అలా కాదు. నిజాయితీకి నిలువుటద్దం అని చెప్పుకొస్తోంది. తనను తాను న్యూట్రల్ మీడియా అని చెబుతోంది. అందుకే ఈనాడు తో పాటు రామోజీరావు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

రాష్ట్రానికి సీఎం అయినా.. విపక్ష నేత అయినా వారి సభలకు వాహనాల్లోనే జనాలు తరలిస్తారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జగన్ మేం సిద్ధం పేరిట బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. మధ్యలో లక్షలాదిమందితో సిద్ధం సభలను ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు సైతం రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రజాగళం పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈనాడు జగన్ కు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. వైసిపి పై వ్యతిరేకత పెంచాలన్న ఉద్దేశంతో.. కొన్ని రకాల వైఫల్యాలను బయటపెట్టాలన్న భావనతో చేసే ప్రయత్నాలు చంద్రబాబుకు నష్టం చేకూరుస్తున్నాయి. వేలాది వాహనాల్లో సిద్ధం సభకు జనాలను తరలిస్తున్నారు. వాహనాల లెక్క చూస్తే సభలకు హాజరయ్యే జన సంఖ్య లక్షలకు దాటుతుంది. మరి చంద్రబాబు విషయంలో మాత్రం అలా చెప్పడం లేదు. అంటే జనాలు రావట్లేదనా? లేకుంటే వాహనాలు పెట్టడం లేదనా? ఏదో ఒక విషయం చెప్పాలి కదా? కానీ జగన్ కు వ్యతిరేకంగా ఏదైనా చెప్పాలన్న ప్రయత్నంలో ఈనాడు అడ్డంగా బుక్ అవుతోంది. చంద్రబాబుకు నష్టం చేకూరుస్తోంది. ఈ విషయంలో ఈనాడు పునరాలోచించకపోతే తెలుగుదేశం పార్టీకి మరింత నష్టం తప్పదు.