Discount On Maruthi Cars :మారుతి కార్లపై భారీ డిస్కౌంట్స్.. వ్యాగన్ ఆర్ పై ఎంత ప్రయోజనం ఉందో తెలుసా?

మారుతి నుంచి వచ్చిన ఆల్టో కె10 ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 వరకు విక్రయిస్తున్నారు. దీనిపై రూ.67 వేల ప్రయోజనాలు ఉండనున్నాయి. అలాగే ఎస్ ప్రెస్సో రూ.4.26 లక్షల నుంచి రూ.6.12 లక్షల వరకు విక్రయించనున్నారు.

Written By: Chai Muchhata, Updated On : April 1, 2024 5:01 pm

Maruthi car

Follow us on

Discount On Maruthi Cars: సాధారణంగా ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలనుకుంటే వాటిపై డిస్కౌంట్ల గురించి చూస్తాం. ఇవి పండుగలు, ప్రత్యేక రోజుల్లోనే ఉంటాయి. కానీ కార్ల కంపెనీలు మాత్రం సాధారణ రోజుల్లోనూ భారీ డిస్కౌంట్లతో వెహికల్స్ ను విక్రయిస్తాయి. మొన్నటి వరకు ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు కొన్ని కార్లు భారీ డిస్కౌంట్లతో మార్కెట్లో హల్ చల్ చేశాయి. తాజాగా కొత్త ఆర్థిక సంవత్సరంలో మారుతి కంపెనీ కళ్లు చెదిరే ఆఫర్లతో ఆకర్షిస్తోంది. ఒక్కో కారుపై ఏకంగా రూ.60 వేలకు పైగా తగ్గింపును ప్రకటించడంతో వినియోగదారులు మారుతి కార్ల కోసం ఎగబడుతున్నారు. ఇంతకీ మారుతికి చెందిన ఏ కార్లు డిస్కౌంట్లతో రానున్నాయంటే?

దేశంలో కార్ల ఉత్పత్తిల్లో అగ్రగామిగా నిలిచే కంపెనీల్లో మారుతి సుజుకి ఒకటి. దీని నుంచి ఇప్పటి వరకు వివిధ మోడళ్లు మార్కెట్లోకి వచ్చి ఆకర్షించాయి. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని కార్లపై కంపెనీ డిస్కౌంట్లను ప్రకటించడం విశేషం. మారుతి కంపెనీ నుంచి రిలీజ్ అయిన వాటిలో వ్యాగన్ ఆర్ అత్యధికంగా విక్రయాలు జరుపుకుంది. అయితే ఎస్ ప్రెస్సో, సెలెరియో మాత్రం అమ్మకాల్లో వెనుకబడి ఉన్నాయి.

వ్యాగన్ ఆర్ కారు ప్రస్తుతం మార్కెట్లో రూ.5.54 లక్షల నుంచి రూ.7.38 వరకు విక్రయిస్తున్నారు. ఇందులో పెట్రోల్ తో పాట సీఎన్ జీ వేరియంగ్ కూడా ఉంది. 88.5 బీహెచ్ పీ పవర్ ను, 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తుంది. లీటర్ పెట్రోల్ కు 25.19 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిపై రూ.66,000 వరకు డిస్కౌంట్ ప్రకటించారు.

మారుతి నుంచి వచ్చిన ఆల్టో కె10 ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 వరకు విక్రయిస్తున్నారు. దీనిపై రూ.67 వేల ప్రయోజనాలు ఉండనున్నాయి. అలాగే ఎస్ ప్రెస్సో రూ.4.26 లక్షల నుంచి రూ.6.12 లక్షల వరకు విక్రయించనున్నారు. ఈ మోడల్ పై రూ.66,000 ప్రయోజనాలు అందించనున్నారు. ఇక సెలెరియో రూ.5.37 లక్షల నుంచి రూ.7.09 లక్షల వరకు విక్రయించనున్నారు. దీని పై రూ.61,000 బెనిఫిట్స్ ఉండనున్నాయి.