MLC Duvvada Family : దువ్వాడ ఫ్యామిలీ స్టొరీకి ఫుల్ స్టాప్ పడడం లేదు. ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. మధ్యలో రకరకాల ట్విస్టులు ఎంట్రీ ఇస్తున్నాయి. రాజీ పంచాయతీలు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. కొత్త వివాదాలను తెరపైకి తెస్తున్నాయి. ఉభయలు తరఫున పెద్దలు, సామాజిక వర్గ నేతలు, సన్నిహితులు రంగంలోకి దిగినా ప్రధాన సమస్యకు మాత్రం పరిష్కార మార్గం దొరకడం లేదు. అన్ని ఓకే కానీ ఆ ఒక్కటి తప్ప అంటూ దువ్వాడ శ్రీనివాస్ తెగేసి చెబుతుండడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ రెండు షరతులు తప్ప అన్నింటికీ ఓకే అని దువ్వాడ శ్రీనివాస్ చెబుతుండగా.. నాకు ఏవీ అవసరం లేదు నా పిల్లలతో సహా నన్ను ఇంటిలోకి రాణిస్తే చాలు అంటూ దువ్వాడ వాణి వేడుకుంటున్నారు. ఇంత జరిగాక కలిసేదేముంది అంటూ దువ్వాడ శ్రీనివాస్ తేల్చి చెబుతున్నారు. నాకున్న యావదాస్తిని పిల్లలకు రాసిస్తానని.. వారి బాధ్యత చూసుకుంటానని.. ముచ్చటపడి కట్టుకున్న కొత్త ఇంటిని ఎవరికీ రాసివ్వనని.. ఎంత జరిగిన తర్వాత భార్య వాణితో కలిసి ఉండలేనని.. విడాకులు తీసుకుంటానని పట్టుబడుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. దీంతో ఈ ఎపిసోడ్ పదో రోజు కూడా కొనసాగుతోంది. అలా అయితే తనకు అవసరం లేదంటూ దువ్వాడ వాణి తన ఇద్దరి కుమార్తెలతో కలిసి శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ సైతం ఇంటి నుంచి అడుగు బయట పెట్టడం లేదు. పోలీసులతో పాటు ప్రెస్ హడావిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. మీడియా ఛానళ్ల ప్రతినిధులు అక్కడే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
* ఆస్తులంతా పిల్లలకే
తనకు దాదాపు 27 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నారు. ఆ ఆస్తులు అన్నింటిని తన ఇద్దరి కుమార్తెల పేరిట రాస్తానని.. తనకు మిగిలింది మూడు కోట్ల విలువ చేసే కొత్త ఇల్లు మాత్రమేనని దువ్వాడ చెబుతున్నారు. తన జీవిత చరమాంకం వరకు ఈ ఇల్లే తమకు ఆధారమని.. ఆ ఇంటిని మాత్రం తన వద్ద ఉంచుకుంటానని చెప్పుకొస్తున్నారు. తన ఇద్దరి పిల్లల బాధ్యతను చివరి వరకు తానే చూసుకుంటానని దువ్వాడ తేల్చి చెప్తున్నారు.
* కలిసి ఉందామంటున్న వాణి
అయితే తన భర్త రాజకీయాలతో పాటు ఆస్తులతో తనకు సంబంధం లేదని.. అందరం కలిసి ఉందాం అంటూ దువ్వాడ వాణి ప్రతిపాదిస్తున్నారు. తనకు తన భర్త ఎటువంటి ఆస్తి ఇవ్వనవసరం లేదని.. విడాకులు కూడా ఇవ్వవద్దని సూచిస్తున్నారు. అయితే ఇంత జరిగాకఆమెతో తాను కలిసి ఉండలేనని దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నారు. సమాజంలో కుటుంబానికి ఉన్న పరువు పోయాక.. కలిసి ఉండడం అనేది జరగని పనిగా తేల్చేస్తున్నారు.
* పరస్పరం కేసులు
మరోవైపు దువ్వాడ నివాసంలో అక్రమంగా ప్రవేశించారని శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దువ్వాడ వాణికి నోటీసులు అందించేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె తీసుకోలేదు. ముందుగా తాను కంప్లైంట్ చేశానని.. ఆ ఆ కేసు పై దువ్వాడ శ్రీనివాస్ కే నోటీసులు ఇవ్వాలని వాణి డిమాండ్ చేశారు. తనతో పాటు తన ఇద్దరు పిల్లలపై దాడి చేశారంటూ దువ్వాడ శ్రీనివాస్ పై వాణి గృహ హింస కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన మరుక్షణమే తాను విడాకులకు అప్లై చేసినట్లు దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నారు. మొత్తానికైతే దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ ఇంకా రగులుతూనే ఉంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Duvvada vani says lets be together duvvada srinivas says that he cant be together with her after this happened
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com