spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Duvvada Srinivas YSR Congress Controversy: తెగేదాకా లాగేసిన దువ్వాడ.. ఇక క్లోజ్

Duvvada Srinivas YSR Congress Controversy: తెగేదాకా లాగేసిన దువ్వాడ.. ఇక క్లోజ్

Duvvada Srinivas YSR Congress Controversy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నుంచి మరో అసమ్మతి గళం సోషల్ మీడియా వేదికగా బయటకు వచ్చింది. వ్యక్తిగత వివాదాలతో పార్టీకి దూరం అయిన దువ్వాడ శ్రీనివాస్ ఇటీవలనే జగన్మోహన్ రెడ్డిని కలిశారు. త్వరలో వచ్చి కలుస్తానని చెప్పారు. మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటానని కూడా అన్నారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారని ఆయన అభిమానులు తెగ హడావిడి చేశారు. కానీ ఇటీవల జరిగిన పరిణామాలతో దువ్వాడ శ్రీనివాస్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. వైసీపీలో ఆయన రీఎంట్రీ పై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన వైసీపీలో చేరడం దాదాపు అసాధ్యం అని కూడా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయన వైసీపీలోకి తెచ్చుకునే ఛాన్స్ కనిపించడం లేదు శ్రీకాకుళం జిల్లాలో..

Also Read: ఇక క్వాంటం శకం.. చంద్రబాబు ఆశయం అదే!

* మూలపేట పోర్టు సందర్శనపై..
ఇటీవల ధర్మాన ప్రసాదరావు( dharmana Prasad Rao ) నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూలపేట పోర్టు సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణులంతా హాజరయ్యాయి. అయితే దీనిపై దువ్వాడ ఇది ఎంత అధర్మం అంటూ పోస్ట్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాన్ని పొలిటికల్ డ్రామాగా అభివర్ణించారు. పోర్టు లోపలికి 40 మందికి అనుమతి ఉంటే ధర్మాన ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అధర్మంగా పూర్తికి పది మీటర్ల దూరంలో టెంట్లు వేసుకుని మాట్లాడి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. కోర్టుకు వంద మీటర్ల రోడ్డు కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాల కోసం అసలు ప్రస్తావించలేదని.. నిర్వాసితులకు తీవ్ర నిరాశ మిగిల్చారు అంటూ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసిపి కార్యక్రమాన్ని దువ్వాడ శ్రీనివాస్ వ్యతిరేకించడం చూస్తుంటే మాత్రం ఆయన రీ యంట్రి విషయం తేలిపోయినట్లు అయింది.

* వీర విధేయత చాటుతూనే..
అధినేత జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) పట్ల వీర విధేయత ప్రదర్శిస్తూ వస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. కానీ జిల్లాలో ధర్మాన సోదరులను వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఏకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని డ్రామా తో అభివర్ణించడంతో దువ్వాడ శ్రీనివాస్ కు దారులు మూసుకుపోయినట్టే. దువ్వాడ విషయంలో జిల్లాలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా ఒకే మాటతో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత వివాదాలతో పార్టీని ఇబ్బందుల్లో పెట్టిన దువ్వాడను మరోసారి పార్టీలోకి తీసుకోవద్దని జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పినట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పోర్టు సందర్శన సక్సెస్ అయ్యిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం అదే కార్యక్రమం పై విమర్శలు చేయడంపై వైసీపీ నాయకత్వం కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు డోర్స్ క్లోజ్ అయినట్టే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ కు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular